Rainfall Prediction: 4 నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు
ABN, Publish Date - Aug 02 , 2025 | 05:28 AM
నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉత్తర, దక్షిణ ద్రోణి ఒకటి ఏర్పడనుంది.
విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉత్తర, దక్షిణ ద్రోణి ఒకటి ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆ తర్వాత రెండు రోజుల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించనుంది. ఇంకా దక్షిణ తమిళనాడు పరిసరాల్లో రానున్న రెండు, మూడు రోజుల్లో తూర్పు, పడమర ద్రోణి ఒకటి విస్తరించే వాతావరణం నెలకొంది. వీటి ప్రభావంతో ఉత్తర తమిళనాడుకు ఆనుకుని రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల ఈనెల 4వ తేదీన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐదో తేదీ నుంచి మరింత పెరిగి అక్కడక్కడా భారీవర్షాలు కురవనున్నాయని పేర్కొంది.
Updated Date - Aug 02 , 2025 | 05:29 AM