ఎమర్జెన్సీని మించిన మోదీ పాలన : రాఘవులు
ABN, Publish Date - Jun 18 , 2025 | 06:20 AM
ప్రధాని మోదీ పాలనతో దేశానికి ఎమర్జెన్సీని మించిన ప్రమాదం వచ్చింది. దీని గురించి ప్రజలకు తెలియజేయాలి’ అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పాలనతో దేశానికి ఎమర్జెన్సీని మించిన ప్రమాదం వచ్చింది. దీని గురించి ప్రజలకు తెలియజేయాలి’ అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘ఎమర్జెన్సీ వల్ల ప్రజాస్వామ్యానికి, రాజకీయ వ్యవస్థకు ఎంత హాని జరిగిందో, ప్రస్తుతం ప్రధాని మోదీ అంతకంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు. ఆరోజు ప్రజలందరూ కలసి ఎమర్జెన్సీ నుంచి దేశాన్ని ఎలా రక్షించుకున్నారో... అలాగే ఈరోజు నయా ఫాసిస్టు శక్తుల ప్రమాదం నుంచి లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఫెడరలిజాన్ని కాపాడుకోవాలి. భారత్-పాకిస్తాన్‌ల మధ్య కాల్పులను తానే విరమింపజేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి వాస్తవాలను బయటపెట్టాలని కోరితే కేంద్రం అంగీకరించడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో దాస్తోంది. ప్రజలకు అబద్ధాలు చెబుతోంది. అమెరికా విదేశాంగ విధానానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ట్రంప్‌నకు దోసోహమంటోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడిని కూడా కేంద్ర ప్రభుత్వం ఖండించలేదు. ప్రధాని మోదీ, ఆయన బృందం యుద్ధోన్మాదుల్ని రెచ్చగొడుతున్నారు’ అని రాఘవులు ఆరోపించారు.
Updated Date - Jun 18 , 2025 | 06:22 AM