ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: క్వాంటమ్‌తో నవశకం

ABN, Publish Date - Jul 06 , 2025 | 03:17 AM

భారత్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పేరు మార్మోగిపోతోంది. భవిష్యత్తులో క్వాంటమ్‌ పరిశ్రమను భారత్‌ శాసించబోతుందా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్‌ వ్యాలీతో దేశ...

  • క్వాంటమ్‌ వ్యాలీతో సరికొత్త విప్లవానికి నాంది

  • క్వాంటమ్‌ పరిశ్రమను శాసించే దిశగా ఏపీ

  • వైద్య, సాంకేతిక రంగాల్లో చరిత్రాత్మక మార్పులు

  • ఈ టెక్నాలజీతో మారనున్న దేశ ముఖచిత్రం

జాతీయ క్వాంటమ్‌ మిషన్‌ లక్ష్యాలు

క్వాంటమ్‌ టెక్నాలజీలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందే జాతీయ క్వాంటమ్‌ మిషన్‌ (ఎన్‌క్యూఎం). 2023 నుంచి 2031 వరకూ కొనసాగే ఈ మిషన్‌ కోసం కేంద్రం మొత్తం రూ.6వేల కోట్లకుపైగా ఖర్చు చేయనుంది. ఈ మిషన్‌లో భాగంగానే ఏపీలో క్వాంటమ్‌ వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మిషన్‌ లక్ష్యాలు ఏమిటంటే..

  • క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌, క్వాంటమ్‌ సెన్సింగ్‌, మెట్రాలజీ, క్వాంటమ్‌ మెటీరియల్స్‌ రంగాల్లో పరిశోధన, అభివృద్ధిని వేగవంతం చేయడం.

  • క్వాంటమ్‌ టెక్నాలజీలో స్వయం సమృద్ధిని సాధించడం.

  • క్వాంటమ్‌ టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయంగా భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టడం.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

భారత్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పేరు మార్మోగిపోతోంది. భవిష్యత్తులో క్వాంటమ్‌ పరిశ్రమను భారత్‌ శాసించబోతుందా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్‌ వ్యాలీతో దేశ, రాష్ట్ర ముఖచిత్రమే మారనుందా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్‌ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గేమ్‌ చేంజర్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ క్వాంటమ్‌ వ్యాలీ అందుబాటులోకి వస్తే టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మన దేశ సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థ ఎవరూ ఛేదించలేనంత పటిష్ఠంగా మారుతుందని, వైద్య రంగంలో నయంకాని ఎన్నో రోగాలకు వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తాయని, వాతావరణంలోని మార్పులను, ప్రకృతి వైపరీత్యాలను కూడా ముందే పసిగట్టవచ్చని, దేశ రక్షణ కోసం శక్తిమంతమైన ఆయుధాలను అభివృద్ధి చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఇవన్నీ.. ఒక్క క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటుతో ఎలా సాధ్యమవుతాయో.. వివరంగా తెలుసుకుందాం.

క్వాంటమ్‌ కంప్యూటర్‌ తయారీ..

1990 నుంచి 2000 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఐటీ సెక్టార్‌లో ఎవరూ ఊహించిన అభివృద్ధిని అందుకుంది. అయితే ఈసారి ఐటీ పరిశ్రమకు బదులుగా క్వాంటమ్‌ ఇండస్ట్రీలో ఆ అభివృద్ధిని తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం అమరావతిలోని 50 ఎకరాలలో క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటు కోసం ఇప్పటికే భూమిని కేటాయించింది. అయితే ఈ క్వాంటమ్‌ వ్యాలీని ముందుకు నడిపించేది క్వాంటమ్‌ కంప్యూటర్‌. ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ సంస్థలు కలిసి త్వరలోనే భారతదేశపు చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్‌ కంప్యూటర్‌ను తయారు చేయబోతున్నాయి. క్వాంటమ్‌ సిస్టమ్‌-2గా భావిస్తున్న ఇది 156 క్యూబిట్ల సామర్థ్యం ఉండే హెరాన్‌ ప్రాసెసర్‌ ద్వారా పనిచేస్తుంది.

క్వాంటమ్‌ టెక్నాలజీ అంటే ఏమిటి..?

క్వాంటమ్‌ టెక్నాలజీ అనేది భౌతికశాస్త్రం, ఇంజనీరింగ్‌ విభాగాల కలయిక. ప్రస్తుతం మనం వాడే సాధారణ కంప్యూటర్ల కన్నా సూపర్‌ కంప్యూటర్స్‌ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. కానీ.. ఆ సూపర్‌ కంప్యూటర్ల కన్నా లక్షల రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేసేవే ఈ క్వాంటమ్‌ కంప్యూటర్లు. దీనికి కారణం మనం వాడే సాధారణ కంప్యూటర్ల బైనరీ మీద ఆధారపడి పనిచేస్తే.. ఇవి క్వాంటమ్‌ మెకానిక్స్‌ సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి. బైనరీ సిస్టమ్‌లో 0, 1 అనే రెండు బిట్స్‌ ఉంటాయి. ఇక్కడ జీరో అంటే ఆఫ్‌ అని.. వన్‌ అంటే ఆన్‌ అని అర్థం. అదే క్వాంటమ్‌ కంప్యూటర్స్‌లో మాత్రం క్వాంటమ్‌ బిట్స్‌ ఉంటాయి. వీటినే క్యూబిట్స్‌ అని కూడా అంటారు. ఈ క్యూబిట్స్‌ ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి ఒకేసారి జీరోగానూ, వన్‌గానూ ఉండగలవు. దీనినే క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో క్వాంటమ్‌ సూపర్‌ పొజిషన్‌ అని అంటారు. ఈ సూపర్‌ పొజిషన్‌ సాయంతో సాధారణ కంప్యూటర్‌లో రెండు బిట్లు చేసే పనినే క్వాంటమ్‌ కంప్యూటర్‌లో ఒక బిట్‌ మాత్రమే పూర్తి చేయగలదు. ఇలా క్యూబిట్స్‌ సంఖ్య పెరిగేకొద్దీ కంప్యూటర్‌ ప్రాసెసింగ్‌ పవర్‌ అనేది విపరీతంగా పెరుగుతుంది. రెండు క్యూబిట్స్‌ ఉన్న కంప్యూటర్‌ నాలుగు పాజిబుల్‌ వ్యాల్యూ్‌సని కనుక్కోగలిగితే 20 క్యూబిట్స్‌ ఉన్న కంప్యూటర్‌ 10 లక్షల కన్నా ఎక్కువ వ్యాల్యూ్‌సని గుర్తించగలదు.

తయారీ అంత ఈజీ కాదు

నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌లో భాగంగా ఇటీవల బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ అనే కంపెనీ భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్‌ కంప్యూటర్‌ను తయారు చేసింది. ఇది 25 సూపర్‌ కండక్టింగ్‌ క్యూబిట్స్‌ సహాయంతో పనిచేస్తుంది. ఇక అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్‌ కంప్యూటర్‌ అయితే.. 156 క్యూబిట్‌ల ప్రాసెసింగ్‌ పవర్‌తో పనిచేయనుంది. అందుకే దీన్ని భారతదేశపు అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్‌ కంప్యూటర్‌ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఆల్గరిథమ్స్‌ను రాయడానికి ఏ హార్డ్‌వేర్‌ను అయితే ఉపయోగిస్తున్నారో ఇది కూడా ఆ విభాగంలోకే వస్తుంది. అలాగే ఈ క్వాంటమ్‌ కంప్యూటర్ల డిజైన్‌ కూడా మనం రోజూ వాడే సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ సిస్టమ్‌ మొత్తాన్నీ కూడా ఒక సీల్డ్‌ బాక్స్‌లో పెడతారు. క్వాంటమ్‌ కంప్యూటర్లను తయారు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడే సాధారణ కంప్యూటర్లలో ట్రాన్సిస్టర్లు కదలకుండా ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. క్వాంటమ్‌ కంప్యూటర్లలో అలాకాదు. ఇక్కడ పార్టికల్స్‌ అనేవి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. కాబట్టి చిన్న వైబ్రేషన్‌ వచ్చినా.. టెంపరేటచర్‌లో చిన్న తేడా వచ్చినా.. రేడియేషన్‌ పెరిగినా.. ఇలా చిన్న అంతరాయం ఎదురైనా ఇవి మైక్రో సెకన్లలోనే తమ క్వాంటమ్‌లను కోల్పోతాయి. అప్పుడు ఈ ప్రాజెక్టు కోసం పెట్టిన ఖర్చంతా వృథా అవుంతుంది. కాబట్టే వీటిని బయటి ప్రపంచంతో సంబంధం లేనటువంటి ఒక ప్రత్యేమైన ఆపరేటింగ్‌ రూమ్స్‌లో ఉంచుతారు. అలాగే -273 డిగ్రీల చల్లటి వాతావరణం మధ్యలో వీటిని ఏర్పాటు చేస్తారు. దీనికోసమే ఈ కంప్యూటర్‌ని ఒక సీల్డ్‌ బాక్సులో భద్రపరుస్తారు. కాబట్టి క్వాంటమ్‌ కంప్యూటర్‌ దాని పూర్తిసామర్థ్యంతో పనిచేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

విప్లవాత్మక మార్పులు

  • క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఎన్నో కాలిక్యులేషన్స్‌ని చేయడం ద్వారా అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులను సుసాధ్యం చేయగలదు.

  • ఇది చూపించే సొల్యూషన్స్‌తో కొత్త వ్యాక్సిన్లను, ఔషధాలను కనుగొనేందుకు సహాయపడగలదు.

  • భవిష్యత్తులో రాబోయే ప్రకృతి విపత్తులను వంద ు కచ్చితత్వంతో అంచనా వేయగలదు.

  • అలాగే స్టాక్‌ మార్కెట్‌లో రిస్క్‌ను తగ్గించడం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వంటి కొత్త టెక్నాలజీని తయారు చేయడం, రవాణాలో ఖర్చుతక్కువయ్యే మార్గాలను కనుగొనడంలో సహాయపడగలదు.

  • సైబర్‌ సెక్యూరిటీ, కమ్యూనికేషన్‌, రక్షణ రంగం, క్రిప్టోగ్రఫీ.. ఇలా ఎన్నో రంగాల్లో క్వాంటమ్‌ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు.

అగ్రదేశాల సరసన చేరేలా..

ఇలాంటి క్వాంటమ్‌ టెక్నాలజీపై అమెరికా, చైనా, ఫ్రాన్స్‌, కెనడా, ఫిన్లాండ్‌ వంటి అతికొద్ది దేశాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో క్వాంటమ్‌ టెక్నాలజీతో ప్రపంచ దేశాలను తనవైపు తిప్పుకొనే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. దీనికోసం చేపట్టిన నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌లో భాగంగా అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్‌ వ్యాలీ 2026 జనవరి 1 నాటికి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. కంప్యూటర్‌ నిర్మాణంతోపాటు, డేటా సెంటర్లు, రిసెర్చ్‌ ఇంక్యుబేటర్లు, టెక్‌ పార్కులను నిర్మించనున్నారు. ప్రపంచాన్ని ప్రభావం చేయను న్న క్వాంటమ్‌ ఇండస్ట్రీలోకి అమెరికా, చైనా వంటి దేశాలు దీటుగా భారత్‌ అడుగుపెట్టడం.. అదికూడా అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీని ఏర్పాటు చేయనుండడం సరికొత్త విప్లవానికి నాంది పలకనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

క్వాంటమ్‌ కంప్యూటర్‌కు 7 సెకన్లు చాలు

క్వాంటమ్‌ వ్యాలీతో అద్భుతాలు ఆవిష్కారమవుతాయి. దీనికి క్వాంటమ్‌ కంప్యూటరే కారణం. వీటిలో ఉండే అసాధారణ కంప్యూటింగ్‌ పవర్‌ ప్రపంచంలోని ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సరే పరిష్కరించగలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మన దగ్గరున్న ఎంతగొప్ప సూపర్‌ కంప్యూటర్‌ అయినా సరే ఒక సమస్య వచ్చిందంటే.. దాన్ని పరిష్కరించడానికి ఒక్కో సమాధానాన్ని ఒకదాని తర్వాత ఒకటి సరిచూసుకుంటూ వెళ్తుంది. దీనికి చాలా సమయం పడుతుంది. కానీ, క్వాంటమ్‌ కంప్యూటర్స్‌ మాత్రం దాని క్వాంటమ్‌ సెర్చ్‌లో సరైన సమాధానం కోసం కోటానుకోట్ల మార్గాలను ఒకేసారి అన్వేషించి వాటిలో నుంచి సరైన సమాధానాన్ని పసిగడుతుంది. ఉదాహరణకు ఒక బలమైన పాస్‌వర్డ్‌ను క్రాక్‌ చేయడానికి ఇప్పుడున్న సూపర్‌ కంప్యూటర్లకు కొన్ని సంవత్సరాలు పడితే.. క్వాంటమ్‌ కంప్యూటర్‌ మాత్రం దానికి ఉన్న ప్రాసెసింగ్‌ స్పీడ్‌తో ఈ పాస్‌వర్డ్‌ను కేవలం ఏడు సెకన్లలోనే క్రాక్‌ చేస్తుంది. ఇది ప్రపంచంలోని ఎంత స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌నైనా సరే కొన్ని సెకన్లలోనే క్రాక్‌ చేయగలదు. కానీ, ఇది సృష్టించే ఎన్‌స్ర్కిప్షన్‌ను బ్రేక్‌ చేయాలంటే మాత్రం శత్రుదేశ హ్యాకర్లకు ఒక జీవిత కాలం సరిపోదు.

Updated Date - Jul 06 , 2025 | 03:20 AM