AP Higher Education: ఉన్నత విద్యలో క్వాంటం టెక్నాలజీ
ABN, Publish Date - Jul 09 , 2025 | 06:24 AM
ఉన్నత విద్యలో క్వాంటం టెక్నాలజీపై సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు దశల వారీగా క్వాంటం టెక్నాలజీ సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులోకి తెస్తారు.
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యలో క్వాంటం టెక్నాలజీపై సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు దశల వారీగా క్వాంటం టెక్నాలజీ సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులోకి తెస్తారు. ఈ టెక్నాలజీపై రాష్ట్రంలోని 500 మంది అధ్యాపకులకు ఐఐటీ మద్రాసు ద్వారా శిక్షణ ఇప్పిస్తారు. ఆరు నెలల్లో శిక్షణ పూర్తిచేసిన తర్వాత దశల వారీగా కోర్సులు అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ సంవత్సరం నుంచి ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా ఇంజనీరింగ్‌లో క్వాంటం కోర్సులకు ఏఐసీటీఈ అనుమతిచ్చింది.
Updated Date - Jul 09 , 2025 | 06:24 AM