ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Goa Governor: రాజ్‌భవన్‌లోకి రాజు

ABN, Publish Date - Jul 15 , 2025 | 06:19 AM

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎక్కడా మచ్చలేదు. ఎన్నో పదవులు చేపట్టి హుందాగా వ్యవహరించారు. రాజు అయినప్పటికీ సామాన్యుల్లో ఒకరిగా మెలిగారు. ఆయనే పూసపాటి అశోక్‌ గజపతిరాజు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎక్కడా మచ్చలేదు. ఎన్నో పదవులు చేపట్టి హుందాగా వ్యవహరించారు. రాజు అయినప్పటికీ సామాన్యుల్లో ఒకరిగా మెలిగారు. ఆయనే పూసపాటి అశోక్‌ గజపతిరాజు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న ఆయనకు సముచిత స్థానం లభించింది. గోవా గవర్నర్‌గా కేంద్రం నియమించింది. అశోక్‌ రాజకీయంగా సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సమకాలికుడు. ముగ్గురూ 1978లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అశోక్‌ విజయనగరం నుంచి జనతాపార్టీ తరఫున గెలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. అది మొదలు ఇప్పటివరకూ గెలుపోటములతో సంబంధం లేకుండా.. ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా టీడీపీలోనే కొనసాగుతున్నారు. 1983, 85, 89, 1994, 1999 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విజయనగరం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో మాత్రం ఓడిపోయారు. తిరిగి 2009లో గెలిచారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో వాణిజ్యపన్నులు, రెవెన్యూ, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖలు నిర్వహించారు. 2014లో విజయనగరం ఎంపీగా విజయం సాధించి.. మోదీ కేబినెట్‌లో పౌరవిమానయాన మంత్రిగా పనిచేశారు. 1951 జూన్‌ 26న జన్మించిన అశోక్‌ టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 1982లో ఎన్టీఆర్‌ పార్టీ ఏర్పాటు ప్రకటన సమయంలో ఆయన వెంటే ఉన్నారు. 4దశాబ్దాలుగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీ అంటే అశోక్‌.. అశోక్‌ అంటే టీడీపీ అన్నట్టు ఉంటుంది. ఆ పార్టీకి విజయనగరం జిల్లాలో సొంత కార్యాలయమంటూ లేదు. అశోక్‌ గజపతిరాజుకు చెందిన అశోక్‌ బంగళాయే కార్యాలయంగా కొనసాగుతూ వస్తోంది. ఎన్టీఆర్‌తో అశోక్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనంటే ఎన్టీఆర్‌కు అమిత గౌరవం. రాజుగారూ అని సంబోధించేవారు. అంత సాన్నిహిత్యమే చంద్రబాబుతోనూ ఉంది. చంద్రబాబు సైతంఆయన మాటకు విలువిస్తారు. ఎన్టీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో కేంద్ర పెద్దలు గవర్నర్‌ పదవి ఆఫర్‌ చేశారు. చంద్రబాబు పార్టీలో అందరి అభిప్రాయాన్ని తీసుకుని అశోక్‌ పేరు సిఫారసు చేశారు.

విద్యాదానం.. భూదానం

వేల ఎకరాలను విద్యాసంస్థలు, దేవాలయాలకు ఇచ్చిన కుటుంబం పూసపాటి రాజవంశీయులది. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో సైతం అశోక్‌ కుటుంబానికి ఆస్తులున్నాయి. అటువంటి విలువైన ఆస్తులను ప్రజలకు అప్పగించారు. కోల్‌కతా నుంచి చెన్నై వరకూ కోస్తా ప్రాంతంలో బీఎస్సీ డిగ్రీ కాలేజీలు లేకపోవడంతో వందేళ్ల కిందటే ఆయన తండ్రి పీవీజీ రాజు మహారాజా కాలేజీని ఏర్పాటుచేసి అన్నిరకాల సైన్స్‌ సబ్జెక్టులను అందుబాటులోకి తెచ్చారు.

వైసీపీ హయాంలో అవమానాలు..

2014-19 మధ్య జగన్‌ హయాంలో అశోక్‌పై కక్షగట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. సింహాచలం సహా అనేక దేవస్థానాలకు అనువంశిక ధర్మకర్తగా ఉన్న ఆయన్ను అడుగడుగునా అవమానించారు. ఆలయాల్లో స్వాగత సత్కారాలు ఆపేశారు. ప్రథమ పూజలు, దర్శనాలను అడ్డుకున్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా ఆయన్ను అక్రమంగా తొలగించి.. ఆయన అన్న కుమార్తె సంచయితను తెచ్చి కూర్చోబెట్టారు. సింహాచలం అనువంశిక ధర్మకర్తగానూ నియమించారు. రామతీర్థంలో కోదండరాముడి విగ్రహ ఆవిష్కరణ సమయంలో సైతం అశోక్‌ను పక్కకునెట్టేశారు. అయితే ఆయన చట్టపరంగానే ఎదుర్కొని అన్నిరకాల అనువంశిక బాధ్యతలు, పదవులు దక్కించుకున్నారు. 2024 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్‌ వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.

Updated Date - Jul 15 , 2025 | 06:22 AM