విద్యుత దీపాలు వెలిగించకుండా నిరసన
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:53 PM
ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సోమవారం తమ నిరసనను తీవ్రతరం చేశారు.
ఆత్మకూరు, జూలై 14(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సోమవారం తమ నిరసనను తీవ్రతరం చేశారు. పట్టణంలోని కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిపై ఉన్న బట్టర్‌ప్లై వీధిదీపాలను వెలిగించకుండా నిరసన వ్యక్తం చేశారు. దీంతో పట్టణంలోని కేజీరోడ్డు చీకట్లను కమ్ముకోవడంతో ప్రజలు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. ఇదిలావుంటే తొలిదశలో భాగంగా ప్రధాన రహదారిపై మాత్రమే వీధిలైట్లను వెలిగించలేదని, మున్సిపల్ అధికారులు స్పందించకపోతే అన్ని ఏరియాల్లో కూడా వీధిదీపాలు వెలగనివ్వమని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు భీష్మించినట్లు తెలిసింది. కాగా మున్సిపల్ కమిషనర్ రమే్‌షబాబు వారితో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరసనలను తెలియజేయాలని కోరినట్లు తెలిసింది.
Updated Date - Jul 14 , 2025 | 11:53 PM