ఎంఎల్‌హెచపీల వ్యాఖ్యల పట్ల నిరసన
ABN, Publish Date - May 08 , 2025 | 11:36 PM
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖలో కీలకంగా పనిచేస్తూ తల్లి బిడ్డల ఆరోగ్యంకోసం అహర్నిశలు కష్టపడుతున్న ఏ ఎనఎంలను, సూపర్‌వైజర్లను కించపరిచేలా వాఖ్యలు చేసిన ఎంఎల్‌హెచపీలు వ్యాఖ్యలను వెంటనే ఉపసం హరించుకునిబహిరంగ క్షమాపణలు చెప్పాలని ఏఎన ఎంలు డిమాండ్ చేశారు.
బద్వేలు రూరల్, మే 8 (ఆంధ్రజ్యోతి) : వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖలో కీలకంగా పనిచేస్తూ తల్లి బిడ్డల ఆరోగ్యంకోసం అహర్నిశలు కష్టపడుతున్న ఏ ఎనఎంలను, సూపర్‌వైజర్లను కించపరిచేలా వాఖ్యలు చేసిన ఎంఎల్‌హెచపీలు వ్యాఖ్యలను వెంటనే ఉపసం హరించుకునిబహిరంగ క్షమాపణలు చెప్పాలని ఏఎన ఎంలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక సురేంద్రనగర్ అర్బనహెల్త్‌సెంటర్ వైద్యాధికారి శ్రీనివాసులుకు వారొక వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఎనఎంలను కించ పరిచేలా వాఖ్యలుచేస్తూ, అవహేలనగా మాట్లాడుతూ గ్రామాల్లో ఏఎనఎంలను కించపరుస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే ఊరుకునేదిలేదన్నా రు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూ కా జాయింట్ సెక్రటరీ సుధాభీరావతి, ఏఎనఎంలు నాగలక్ష్మి, వసుంధర, లక్ష్మీనారాయణమ్మ, సుబ్బనరస మ్మ, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 11:36 PM