ప్రమాదకర రసాయనాల నుంచి పర్యావరణం కాపాడుకోవాలి
ABN, Publish Date - May 11 , 2025 | 10:52 PM
పరిశ్రమల నుంచి వెలువడే ప్రాణాంతక రసాయనాల నుంచి ప్రజలు ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంద్‌బాబు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు యూజీ శ్రీనివాసులు పేర్కొన్నారు.
కర్నూలు న్యూసిటీ, మే 11(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల నుంచి వెలువడే ప్రాణాంతక రసాయనాల నుంచి ప్రజలు ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంద్‌బాబు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు యూజీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రాణాంతక రసాయనాల ప్రమాదం నుంచి ప్రజల ప్రాణాలు, పర్యావరణాన్ని కాపాడుకుందాం..! అనే అంశంపై ఆదివారం స్థానిక కార్మిక కర్షక భవనలో ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక అధ్వర్యంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాక్రిష్ణ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడారు. కొత్త రకమైన రాసాయన ఉత్పత్తి కోసం పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. రయసానాల ఉత్పత్తి ద్వారా వచ్చే వ్యర్థాలు మానవ మనుగడకే ప్రమాదంగా మారబోతున్నాయని అన్నారు. 12న కలెక్టరేట్ ఎదుట జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, కన్వీనర్ రామకృష్ణ, విశ్రాంత అధ్యాపకులు రమేష్, టీటీఎఫ్, యూటీఎఫ్ నాయకులు రత్నం, ఏసేపు, సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్ పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 10:52 PM