గ్రామ సేవకులకు పదోన్నతులు కల్పించాలి
ABN, Publish Date - May 19 , 2025 | 11:40 PM
గామ సేవకులకు అర్హతను బట్టి పదోన్నతులు కల్పించాలని ఆ సం ఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరా రు,
జమ్మలమడుగు, మే 19 (ఆంధ్రజ్యోతి): గామ సేవకులకు అర్హతను బట్టి పదోన్నతులు కల్పించాలని ఆ సం ఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరా రు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్డీవో సాయిశ్రీకి అర్జీలు అందజేశారు. అందులో భాగంగా జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో సంఘ నేతలు ఆర్డీవో సాయిశ్రీకి వినతి పత్రం అందజేశారు. గ్రామ సేవకుల సమస్యపై గతంలో కూడా వినతి పత్రాలు అందించినట్లు తెలిపారు. మదనపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారికి గ్రామ సహాయకులు వినతి పత్రాలు అందించడంతో పది మందికి వాచ్‌మెన్, 10 మందికి అటెండర్ పోస్టులు మంజూరు చేశారని తమకు కూడా పదోన్నతులు కల్పించాలని ఆర్డీవోకు విజ్ఞప్తి చేశారు. వెంటనే ఆర్డీవో సాయిశ్రీ గ్రామ సేవకుల సమస్యలకు సంబందించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని చెప్పారు. అలాగే ప్రొద్దుటూరుకు చెందిన పలు ప్రాంతాలవారు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సేవకులు గురుమోహన్, ఖాజాహుస్సేన్, రత్నం, డానియేలు, సుబ్బరాయుడు, పాములేటి, చంద్రశేఖర్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 19 , 2025 | 11:41 PM