అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడు
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:34 PM
సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షతను వ్యతిరేకించి సమ సమాజం కోసం పోరాడిన అభ్యుదయ వాది మహాత్మా బసవేశ్వరుడు అని కలెక్టర్ రంజిత బాషా కొనియాడారు.
కలెక్టర్ రంజిత బాషా
ఫ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి
ఫ పాల్గొన్న వీరశైవ, జంగమ సంఘాల నాయకులు
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షతను వ్యతిరేకించి సమ సమాజం కోసం పోరాడిన అభ్యుదయ వాది మహాత్మా బసవేశ్వరుడు అని కలెక్టర్ రంజిత బాషా కొనియాడారు. బుధవారం మహాత్మా బసవేశ్వర 892వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ కాన్ఫరెన్సహాల్లో జిల్లా యువజన సంక్షేమశాఖ-సెట్కూరు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బసవేశ్వర చిత్రపటానికి కలెక్టర్, వీరశైవ, జంగమ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 12వ శతాబ్దంలో కర్ణాటకలో జన్మించిన బసవేశ్వరుడికి ఆరోజుల్లోనే మనుషులంతా ఒక్కటే.. అందరూ సమానం అనే ఆలోచనలు ఉండడం చాలా గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్, వీరశైవ ఐక్య సంఘం అధ్యక్షుడు ఏజీ మల్లికార్జునప్ప, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరప్ప, సంఘ సభ్యులు విశ్వేశ్వరయ్య, శివరాజ్, యాగంటయ్య, శెట్టి వీరశేఖరప్ప, యా గంటి ఈశ్వర్, మల్లికార్జునయ్య, వీరశైవ జంగమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:34 PM