AP Engineering Colleges: ఫీజు బకాయిలు చెల్లించకపోతే పోరాటం
ABN, Publish Date - Jun 15 , 2025 | 05:37 AM
ఆర్థిక భారంతో కాలేజీలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సంఘం తెలిపింది. 2023-24లో మూడు క్వార్టర్లు, 2024-25లో రెండున్నర క్వార్టర్ల ఫీజులు ప్రభుత్వం...
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సంఘం
అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక భారంతో కాలేజీలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సంఘం తెలిపింది. 2023-24లో మూడు క్వార్టర్లు, 2024-25లో రెండున్నర క్వార్టర్ల ఫీజులు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉందని పేర్కొంది. సంఘం సర్వసభ్య సమావేశం శనివారం విజయవాడలో జరిగింది. సమావేశం అనంతరం సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి మధుసూదన్‌రావు, కోశాధికారి గ్రంధి సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. సుమారు రూ.3వేల కోట్ల ఫీజుల బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఎక్కువ శాతం ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా చేరిన విద్యార్థులే ఉన్నారని తెలిపారు. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని, ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లగా, జూలైలో ఫీజులు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం జూలైలో బకాయిలు విడుదల చేయాలని, లేనిపక్షంలో తప్పనిసరి పరిస్థితుల్లో పోరాటానికి దిగక తప్పదని పేర్కొన్నారు.
Updated Date - Jun 15 , 2025 | 05:37 AM