Droupadi Murmu: 10న విశాఖకు రాష్ట్రపతి
ABN, Publish Date - May 28 , 2025 | 06:11 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 10న విశాఖపట్నం వెళ్లి గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరవుతారు. విశాఖ ఎయిర్‌పోర్టులో గౌరవ వందనం తర్వాత ఆమె కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లి కార్యక్రమంలో పాల్గొంటారు.
గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు
విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల పదో తేదీన విశాఖపట్నం రానున్నారు. ఆర్కే బీచ్‌రోడ్డులో గల ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. పదో తేదీ ఉదయం 9.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్‌పోర్టులో గౌరవ వందనం స్వీకరించిన తరువాత రాష్ట్రపతి 11.40 గంటలకు రోడ్ మార్గాన బయలుదేరి ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కన్వెన్షన్ సెంటర్ నుంచి బయలుదేరి 1.10 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని 1.20 గంటలకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ వెళతారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 06:11 AM