Regional MPs: ఎంపీలకు రాష్ట్రపతి అల్పాహార విందు
ABN, Publish Date - Mar 18 , 2025 | 05:18 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంపీలకు సోమవారం అల్పాహార విందు ఇచ్చారు.
హాజరైన టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలు
న్యూఢిల్లీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంపీలకు సోమవారం అల్పాహార విందు ఇచ్చారు. స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మనోహర్‌లాల్ ఖట్టర్, కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్పాహార విందుకు ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, హరియాణాకు చెందిన ఎంపీలను రాష్ట్రపతి ఆహ్వానించారు. విందు సందర్భంగా ఎంపీలను పలకరించిన రాష్ట్రపతి వారి పార్లమెంట్ నియోజకవర్గ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, దగ్గుమళ్ల ప్రసాదరావు, కలిశెట్టి అప్పలనాయుడు, పుట్టా మహేశ్, టి కృష్ణప్రసాద్, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, అంబికా లక్ష్మీనారాయణ, శ్రీభరత్, కేశినేని చిన్ని, జీఎం హరీష్, బీజేపీ ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేశ్, జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Mar 18 , 2025 | 05:18 AM