ఖరీఫ్ సాగుకు సన్నద్ధం
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:06 AM
ప్రస్తుతం రుతుపవనాల ఆరంభంలో వర్షాలు బాగా కురి యడంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధమ వుతున్నారు.
ప్రతి ఏడాది జూన్ నెల నుంచి పంటలు సాగు చేసేందుకు రైతాంగం సమాయత్తం అవుతుంది. ఈ ఏడాది వర్షాలు ఆరంభంలో బాగా కురియడంతో ఖరీఫ్ సీజన్ పంటలు సాగు చేయడానికి రైతన్న లు కోటి ఆశలతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ట్రాక్టర్లతో దుక్కులు దున్నడంతో పాటు పశువుల ఎరువునుతోలి సాగుకు సిద్ధమవుతు న్నారు
చాపాడు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం రుతుపవనాల ఆరంభంలో వర్షాలు బాగా కురి యడంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధమ వుతున్నారు. కోటి ఆశలతో పంటలు సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ట్రాక్టర్లతో దుక్కులు దున్ని పశువుల ఎరువును భూముల్లోకి తోలి పంట సాగుకు భూమిని సర్వం సిద్ధం చేశారు. మండలంలోని రైతులు ఎక్కువ భాగం వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. మండలంలో మొత్తం 32 వేల ఎకరాల్లో భూములు ఉన్నాయి. కేసీ కెనాల్, చాపాడు చానెల్, పెన్నా, కుందూ నది ప్రధాన జలవనరులు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్‌లో వరిపైరు సాగు చేస్తారు. పసుపు, వేరుశనగ, తక్కువ సాగు చేస్తారు. వరిపైరు సుమారు 26 వేల ఎకరాల్లో సాగు చేస్తారు. వరిగడ్డి పుష్కలంగా లభిస్తుండడంతో గ్రామాలు పాడిపరిశ్రమకు నిలయంగా ఉన్నాయి. కేసీ కెనాల్‌కు జూలై నెలలో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సాగునీరు రాగానే రైతులు నారుకయ్యలు వేస్తారు. 20 రోజుల తర్వాత వరినాట్లు వేసే పనిలో బిజీగా ఉంటారు. వరిపైరు సాగులో పచ్చిరొట్ట ఎరువుగా జనుము, జీలుగలు ఉపయోగిస్తారు.దీనివల్ల మంచి దిగుబడి, తెగుళ్లు రాకుండా ఉంటాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం జీలుగ, జనుము, విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం
పోరుమామిళ్ల, జూన 8 (ఆంధ్రజ్యోతి): ఈ సారి ముందుగానే రుతుపవనాలు పలకరించడం, వాతా వరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రైతన్నలు సాగుకు సన్నద్ధమవుతున్నారు ముఖ్యం గా పోరుమామళ్ల మండలంలో వరినే ప్రధాన పం టగా రైతన్నలు ఎన్నుకుంటారు. గత ఖరీఫ్‌లో దాదాపు 2వేల ఎకరాలకు పైగానే వరి సాగు చేశా రు. పోరుమామిళ్ల చెరువు ఆయకట్టు పరిధిలో దమ్మనపల్లె, మార్కాపురం, కవలకుంట్ల, క్రిష్ణంపల్లె, గానుగపెంట, చల్లగిరిగెల, టేకూరుపేట తదిత ర ప్రాంతాల్లో వరిని ఎక్కువగా సాగు చేస్తారు. మరి కొందరు సజ్జ, జొన్న, మొక్కజొన్న పంటల ను సాగు చేయనుండగా మరికొందరు పత్తి క్రాసింగ్ పంటలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తా రు. దాదాపు 800 నుంచి వెయ్యి లోపు ఉద్యా న పంటలపైన ఆసక్తి కనబరుస్తారు. గత ఏడాది ఖరీఫ్‌లో 5800 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ముఖ్యంగా పోరు మామిళ్ల, రంగసముద్రం మరికొ న్ని ప్రాంతాల్లో చెరువునీటిపై ఆధారపడతారు. దమ్మనపల్లె తదితర ప్రాం తాల్లో దుక్కులు దున్ని పొలాలను పైర్లు వేసేందు కు సిద్ధం చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల వరి నార్లు వేసుకునేందుకు రైతులు పొలా లను దుక్కులు దున్ని నార్లు పోసుకునేందుకు తయారు చేసుకుం టున్నారు. ఈ సారి విస్తీర్ణం పెరిగే అవకాశాలు న్నాయని వ్యవసాయాధికారి డాక్టర్ సాంబ, వర హరికుమార్ తెలిపారు. రైతులు కూడా యాజ మాన్య పద్ధతులు పాటించి వ్యవసాయాధికారుల సలహాలు తీసుకుని పంటలు సాగు చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు.
ఖరీఫ్ విత్తనాల కోసం ఎదురుచూపు
దువ్వూరు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):ముందస్తుగా వానలు పలుకరించడంతో రైతులు పొలాలు సాగుకు సిద్ధం చేసుకుని ఖరీఫ్ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. దువ్వూరు మండలంలో కేసీ కాలువ కింద వరి పంట ఎక్కువగా వేస్తారు. ఇతర పంటలుగా పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న, జొన్న, కందులు, పెసలు సాగు చేయడం జరుగుతోంది. డివిజన్‌లోని మైదుకూరు, చాపాడు, ఖాజీపేట, దువ్వూరు, రాజుపాళెం మండలాల పరిధిలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తన అవసరాన్ని గుర్తించి ప్రతిపాదనలు తయారు చేసే పనిలో ఉన్నారు.
నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తత అవసరం
వ్యవసాయ శాఖ నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన పురుగు మందులు విక్రయించకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని రైతు నాయకులు కోరుతున్నారు. వ్యవసాయ అధికారులు నకిలీ విత్తన వ్యాపారులపై కొరఢా జులిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుతున్నారు.
Updated Date - Jun 09 , 2025 | 12:06 AM