ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

State Wide Protests: ప్రసన్న వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసన

ABN, Publish Date - Jul 09 , 2025 | 04:17 AM

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

  • ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి పలువురి సంఘీభావం.. ప్రసన్నను అరెస్టు చేయాలని డిమాండ్‌

  • ఏఎస్పీకి ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: మహిళా కమిషన్‌

నెల్లూరు, నెల్లూరు (క్రైం), జూలై 8(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. నెల్లూరులో మాజీ మేయర్‌ భానుశ్రీ నేతృత్వంలో మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. ప్రసన్నను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కోవూరులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రసన్నను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐ సుధాకరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రసన్న వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు.

ఏఎస్పీకి ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు

సంస్కారంలేని ప్రసన్నను ప్రజాజీవితం నుంచి బహిష్కరించాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్యను కలిసి ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రసన్న హయాంలో జరిగిన గ్రావెల్‌ దోపిడీ, అవినీతి, అక్రమాల గురించి మాట్లాడుతుంటే.. మహిళనని కూడా చూడకుండా నోరు పారేసుకున్న ప్రసన్నను చట్టపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు.

సోషల్‌ మీడియాలో ప్రశాంతిరెడ్డికి మద్దతు

ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో ‘వీ స్టాండ్‌ విత్‌ ప్రశాంతిరెడ్డి’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌ల్లో ఇది మూడో స్థానంలో నిలిచింది. ప్రసన్న వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేసు నమోదు చేయకపోవడం అన్యాయం: వైసీపీ

ప్రసన్న ఇంటిపై దాడి జరిగి ఒక రోజైనా పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం అన్యాయమని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఏఎస్పీ సౌజన్యకు ఫిర్యాదు చేశాక ఆయన మీడియాతో మాట్లాడారు. దాడిలో పాల్గొన్న వారందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 09 , 2025 | 04:18 AM