విద్యార్థులకు ‘యువ ప్రకాశం’ ఇంటర్న్‌షిప్
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:53 AM
యువ ప్రకాశం పేరుతో వే సవిలో నిర్వహిస్తున్న ఇంట ర్న్‌షిప్ కార్యక్రమాన్ని విద్యా ర్థినీ, విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని కలె క్టర్ తమీమ్‌అన్సారియా పిలుపునిచ్చారు.
కలెక్టర్ అన్సారియా
ఒంగోలు కలెక్టరేట్, ఏ ప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): యువ ప్రకాశం పేరుతో వే సవిలో నిర్వహిస్తున్న ఇంట ర్న్‌షిప్ కార్యక్రమాన్ని విద్యా ర్థినీ, విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని కలె క్టర్ తమీమ్‌అన్సారియా పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ సమా వేశపు హాలులో శుక్రవారం యువజన సంక్షేమశాఖ కార్యాలయం ప్రచురించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. 30 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగు తుందన్నారు. వాటర్‌మేనేజ్‌మెంట్, హెల్త్, పంచాయతీరాజ్, ఉపాధి కల్పన, మహిళా శిశు ఆరోగ్య, రోడ్లు, భవనాలు, నగర అభివృద్ధి అంశాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని అన్ని కళా శాలల యాజమాన్యాలు తమ సంస్థల్లో చదుతున్న విద్యార్థులను ఇందులో చే రేలా ప్రోత్సహించాలన్నారు. మే 14 నుంచి జూన్ 13వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో స్టెప్ సీఈవో శ్రీమన్నారాయ ణ, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 26 , 2025 | 12:53 AM