ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వాగులో గల్లంతైన యువకుడు మృతి

ABN, Publish Date - May 27 , 2025 | 12:31 AM

పర్చూరువాగులో యువకులు గల్లంతైన ఘటన సోమవారం చోటుచేసుకుంది.

పర్చూరు, మే 26 (ఆంధ్రజ్యోతి) మే 26: పర్చూరువాగులో యువకులు గల్లంతైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఇంటి నుంచి బహిర్భూమికి అని వెళ్లిన యువకుడు జొన్నలగడ్డ మోహన్‌ కుమార్‌(24) ఎంతసేపటికీ రాకపోవడంతో కుంటుంబ సభ్యులు బంధువులు వాగువద్దకు వెళ్లి వెతికారు. గట్టుమీద బైక్‌ ఉండటంతో వాగులో పడి ఉంటాడని ఆందోళనకు గురయ్యారు. యువకుడు వాగులో గల్లంతయ్యాడన్న వార్త తెలుసుకున్న కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని తండ్రి నాగరాజు నుంచి అందిన సమాచారం మేరకు ఎస్సై మాల్యాద్రి, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చీరాల ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది వాగును గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైధ్యశాలకు తరలించారు.

పర్చూరు ఇందిరా కాలనీలో విషాదం...

వాగులో ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందడంతో పర్చూరు అంబేద్కర్‌ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా అకాల మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

కుటుంబ కష్టాలు వర్ణనాతీతం..

తండ్రి నాగరాజు ఆర్టీటీసీ గ్యాలరీలు ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను పక్షవాతంతో భాదపడుతున్నాడు. రెండో కుమారుడు ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలువిరిగి మంచంలో ఉన్నాడు. అనారోగ్య సమస్యలు, కుటుంబ కష్టాలు వేదిస్తున్న తరుణంలో ఇలా చేతికి అందివచ్చిన కుమారుడు మృతిచెందడం కుటుంబాన్ని తీవ్ర దుఖంలోనికి నెట్టింది.

Updated Date - May 27 , 2025 | 12:31 AM