ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ ఆత్మ విమర్శ చేసుకోవాలి

ABN, Publish Date - Jul 01 , 2025 | 11:06 PM

ప్రజా ప్రభుత్వం ఏడాది పాలనలో ఏమీ చేయలేదని అబద్దపు ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, ముఖ్యంగా విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ధ్వజమెత్తారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే జనార్దన్‌, పక్కన రియాజ్‌, సుజాత

ఎమ్మెల్యే దామచర్ల

పార్టీలు మారితే చేసిన పాపాలు పోతాయా ?

సంక్షేమం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం

మీడియా సమావేశంలో దామచర్ల, రియాజ్‌

ఒంగోలు, కార్పొరేషన్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వం ఏడాది పాలనలో ఏమీ చేయలేదని అబద్దపు ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, ముఖ్యంగా విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ధ్వజమెత్తారు. మంగళవారం ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీల నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ వైసీపీ పాలనలో నవరత్నాలు పేరుతో ప్రజలను మోసంచేసిన సంగతి మర్చిపోయారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా పింఛన్‌ పెంచడానికి ఐదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. పేదలకు టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పాడుపెట్టడంతోపాటు, లబ్ధిదారుల పేరుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వడ్డీలు కూడా కట్టకుండా ఎగవేసిన ఘనత వైసీపీదేనని విమర్శించారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడంతో నేటికీ విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. తప్పుడు పనులు చేసిన ఆ పార్టీ నేతల అరెస్ట్‌ తదితర అన్నీ విషయాల్లోనూ పోలీసులు నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారమే ముందుకెళుతున్నారని చెప్పారు. ఒంగోలులో గత వైసీపీ పాలనలోనే టీడీపీ శ్రేణులపై 87 అక్రమ కేసులు పెట్టిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. మహిళలు అని కూడా చూడకుండా అరెస్టులు చేయించిన మాజీ మంత్రి తాను పార్టీ మారానని మాట్లాడుతున్నారని, గత ఐదేళ్లు అరాచకాలు చేసి, నేడు పార్టీలు మారితే పాపాలు పోతాయా? బాధితులు బాధ తగ్గుతుందా? అని విమర్శించారు. 151 సీట్లు వచ్చాయని 2019లో విర్రవీగి, ప్రజలను మోసం చేశారని, అదే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన సంగతిని నిత్యం గుర్తుంచుకోవాలని చెప్పారు. సూపర్‌ సిక్స్‌లో భాగంగా ఇప్పటికే పింఛన్లు పెంపు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి వందనం నగదు, ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్‌లు, డీఎ్‌ససీ విడుదల, అలాగే అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేసిందని తెలిపారు. దాంతోపాటు వచ్చే నెల 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమవుతుందని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం నుంచి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రజలతో మమేకం అవుతున్నట్లు తెలిపారు. రోజూ 50 ఇళ్లకు వెళ్లి ప్రజలతో మాట్లాడనున్నట్లు దామచర్ల చెప్పారు. జనసేన జిల్లా అధ్యక్షులు లైౖవ్‌ స్టాక్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ షేక్‌ రియాజ్‌ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పంచాయితీ రాజ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారన్నారు. ఓర్వలేని వైసీపీ నేతలు వారు చేయరు.. చేసేవారిని చేయనివ్వకుండా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు శ్రీనివాసరావు, మేయర్‌ గంగాడ సుజాత పలువురు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:06 PM