ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి

ABN, Publish Date - Jul 18 , 2025 | 01:21 AM

మార్కెట్‌యార్డు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమితులైన ప్రతి ఒక్కరూ ప్ర జలకు బాధ్యులుగా ఉంటూ కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సూచించారు. ఇటీవల గిద్దలూరు, కంభం మా ర్కెట్‌యార్డు చైర్మన్‌లు, వైస్‌చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులైన వారికి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి గురువారం నియామకపత్రాలను అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

నూతనంగా నియమితులైన

మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్లు,

డైరెక్టర్లకు అశోక్‌రెడ్డి సూచన

నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే

గిద్దలూరు టౌన్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : మార్కెట్‌యార్డు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమితులైన ప్రతి ఒక్కరూ ప్ర జలకు బాధ్యులుగా ఉంటూ కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సూచించారు. ఇటీవల గిద్దలూరు, కంభం మా ర్కెట్‌యార్డు చైర్మన్‌లు, వైస్‌చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులైన వారికి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి గురువారం నియామకపత్రాలను అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఆయా పరిధిలోని పాలకవర్గాలు రైతుల, పశుపోషకుల సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా ఉండాలని

తెలిపారు. ప్రభుత్వం చేసే మంచిని అం దించే సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియచేస్తూ ప్రజాసమస్యలను కూడా ఎప్పటికప్పుడూ పరిష్కరించి ప్రజ ల మన్ననలు పొందాలన్నారు. గిద్దలూరు మార్కెట్‌యార్డు చైర్మన్‌గా బైలడుగు బాలయ్యయాదవ్‌, కంభం మార్కెట్‌యా ర్డు చైర్మన్‌గా పూనూరు భూపాల్‌రెడ్డి, గిద్దలూరు, కంభం వైస్‌చైర్మన్లుగా గోడి ఓబులరెడ్డి, తోట మహాలక్ష్మి, ఆయా డైరెక్టర్లు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి కృతజ్ఞతలు తె లుపుతూ పూలమాల, శాలువలతో సన్మానించారు. ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తెస్తామని, నిరంతరం రైతులకు తోడుగా ఉంటామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 01:21 AM