ప్రజా సమస్యలపై చర్చ జరిగేనా?
ABN, Publish Date - May 31 , 2025 | 02:20 AM
జిల్లాలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమప్రాంత ప్రజానీకం తాగునీటి సమస్యతో అల్లాడుతోంది.
గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్న రైతులు
తాగునీటి కోసం తల్లడిల్లుతున్న పశ్చిమ ప్రజానీకం
నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం
ఏడు అంశాలతో అజెండా
ఒంగోలు కలెక్టరేట్, మే 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమప్రాంత ప్రజానీకం తాగునీటి సమస్యతో అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించిన ఆయా సమస్యలపై చర్చించి అవసరమైతే తీర్మానం చేసి ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆదిశగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ప్రజానీకం కోరుతోంది.
పొగాకు రైతుల్లో ఆందోళన
జిల్లాలో ప్రస్తుతం పొగాకుతోపాటు పలు రకాల పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగేళ్ల నుంచి పొగాకుకు మంచి డిమాండ్ ఉండ టంతో జిల్లావ్యాప్తంగా వర్జీనియాతోపాటు బర్లీ పొగాకును విస్తారంగా సాగు చేశారు. అయితే కొనుగోళ్లు మందగిం చడం, లోగ్రేడ్ పొగాకు అసలు కొనుగోలు చేయకపోవడం, ఎక్కువ శాతం నోబిడ్ చేయడంతో రైతులు తల్లడిల్లిపోతు న్నారు. ఇప్పటికే పెట్టుబడి భారీగా పెట్టి ఆందోళన చెందు తున్నారు. ఇంకోవైపు ఉమ్మడి జిల్లాలో బర్లీ పొగాకును విస్తారంగా సాగు చేశారు. నెలల తరబడి కొనుగోలు చేయకపోవడంతో రైతుల నివాసాల్లో నిల్వలు పేరుకుపో యాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసు కొని రైతులు పండించిన పొగాకును కొనుగోలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవి ధంగా శనగ, మిర్చి తదితర రకాల పంటలకు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
తాగునీటికి ఇక్కట్లు
పశ్చిమప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా నెలకొంది. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరు సరిపోవడం లేదు. దీంతోపాటు ఇతరత్రా అనేక సమస్యలతో జిల్లావ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు సకాలంలో వేతనం అందడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం జరగనున్న జడ్పీ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి జిల్లా అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కాగా జడ్పీ సమావేశంలో మొత్తం ఏడు అంశాలతో పరిమితంగానే అజెండాను రూపొందించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, విద్య, వ్యవసాయ, ఉద్యానవనశాఖలతోపాటు జడ్పీ స్థాయీ సంఘాల తీర్మానాలను ఆమోదించనున్నారు. పరిమితంగానే అజెండా అంశాలు ఉన్నందున ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి తక్షణం ఉపశమనం పొందే విదంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Updated Date - May 31 , 2025 | 02:20 AM