ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఒంగోలు మెప్మాలో ఏం జరుగుతుంది?

ABN, Publish Date - Jul 12 , 2025 | 10:21 PM

పొదుపు మహిళల పేరుతో నకిలీ సంఘాలు సృష్టించి కోట్లు దండుకుంటున్న ఆర్పీల అవినీతిపై ఆ సంస్థ ఎండీ సీరియస్‌ అయ్యారు. అక్రమాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని పీడీ శ్రీహరిని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు మెప్మాలో ఏం జరుగుతుందోననే చర్చ జిల్లా అంతగా మొదలైంది. కొందరు ఆర్పీల అక్రమాలు వెలుగులోకిరావడంతో బాధిత పొదుపు మహిళలు సైతం ఇప్పుడిప్పుడే బయటకొచి అన్యాయాలను వివరిస్తున్నారు. రెండు నెలల క్రితం ఒంగోలు నగర పరిధి కేశవస్వామిపేటలో ఉండే యానాదులను మోసం చేసిన ఓ ఆర్పీ భారీగానే దండుకుంది. దీనిపై రచ్చకావడంతో తాను తీసుకున్న సొమ్ము చెల్లిస్తానంటూ సభ్యులకు సర్దిచెప్పుకుంది. నేటికీ ఎలాంటి చెల్లింపులు జరగకపోవడం, మరోవైపు అధికారులు సైతం చర్యలు తీసుకోకపోవడంతో అదేబాటలో మరికొందరు బోగస్‌ గ్రూపుల తయారీలో ఉన్నారు. తాజాగా పేర్నమిట్ట ఆర్పీపై వచ్చిన ఆరోపణలతో బోగస్‌ గ్రూపుల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ భాగోతంలో కీలకపాత్ర వహించిన వారిని తప్పించగా, మరికొందరి పాత్రపై విచారణ సాగుతుంది.

అవినీతి వ్యవహారాలపై ఎండీ తేజ్‌భరత్‌ సీరియస్‌

ఆర్పీలపై కఠినచర్యలు తీసుకోవాలని పీడీకి ఆదేశం

ఇకపై బోగస్‌ పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసే వారికి చుక్కలే

గత అక్రమాలపై చర్యలు లేకపోవడమే కారణమా!

పొదుపు మహిళల పేరుతో నకిలీ సంఘాలు సృష్టించి కోట్లు దండుకుంటున్న ఆర్పీల అవినీతిపై ఆ సంస్థ ఎండీ సీరియస్‌ అయ్యారు. అక్రమాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని పీడీ శ్రీహరిని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు మెప్మాలో ఏం జరుగుతుందోననే చర్చ జిల్లా అంతగా మొదలైంది. కొందరు ఆర్పీల అక్రమాలు వెలుగులోకిరావడంతో బాధిత పొదుపు మహిళలు సైతం ఇప్పుడిప్పుడే బయటకొచి అన్యాయాలను వివరిస్తున్నారు. రెండు నెలల క్రితం ఒంగోలు నగర పరిధి కేశవస్వామిపేటలో ఉండే యానాదులను మోసం చేసిన ఓ ఆర్పీ భారీగానే దండుకుంది. దీనిపై రచ్చకావడంతో తాను తీసుకున్న సొమ్ము చెల్లిస్తానంటూ సభ్యులకు సర్దిచెప్పుకుంది. నేటికీ ఎలాంటి చెల్లింపులు జరగకపోవడం, మరోవైపు అధికారులు సైతం చర్యలు తీసుకోకపోవడంతో అదేబాటలో మరికొందరు బోగస్‌ గ్రూపుల తయారీలో ఉన్నారు. తాజాగా పేర్నమిట్ట ఆర్పీపై వచ్చిన ఆరోపణలతో బోగస్‌ గ్రూపుల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ భాగోతంలో కీలకపాత్ర వహించిన వారిని తప్పించగా, మరికొందరి పాత్రపై విచారణ సాగుతుంది.

ఒంగోలు, కార్పొరేషన్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రప్రభుత్వం పొదుపు సంఘాలను బలోపేతం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. వారి కోసం పలు పథకాలను అమలుచేస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతుంటే.. ఒంగోలు మెప్మాలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అక్కడ రోజుకో అవినీతి భాగోతం వెలుగులోకి వస్తోంది. వరుస పరిణామాల క్రమంలో మెప్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ తేజ్‌ భరత్‌ సీరియస్‌ అయ్యారు. శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘మెప్మాలో మళ్లీ బోగస్‌ రచ్చ’ కథనంపై ఆయన జిల్లా అధికారి పీడీ శ్రీహరితో మాట్లాడారు. ఆర్పీల అవినీతి వ్యవహారాలపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. గత ఏడాది నుంచి మెప్మాలో ఆర్పీల అవినీతిపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురిస్తుంది. పొదుపు సభ్యుల ఆధార్‌ కార్డ్‌లను ఆన్‌లైన్‌లో మరోసారి సీడింగ్‌ చేసి, వారి పేరుతో నకిలీ పొదుపు గ్రూపుల తయారు చేయడాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

అవినీతి ఆరోపణలు వస్తే ఇంటికే..

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో ఆర్పీల అవినీతి వ్యవహారం, నకిలీ గ్రూపులపై పీడీ శ్రీహరి విచారణకు సిద్ధమయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, అవినీతికి పాల్పడిన ఆర్పీల జాబితాను సిద్ధం చేస్తున్నారు. పొదుపు సంఘాల సభ్యులను మోసం చేస్తూ, బ్యాంకులను బురిడీ కొట్టిస్తూ కోట్లు దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. బోగస్‌ పేరుతో దోచుకున్న సొమ్మును రికవరీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో వారిలో ఆందోళన మొదలవ్వగా, మరికొందరు ఆర్పీలు తమపైకి వస్తే అందులో భాగస్వాములైన వారిని బయటకు లాగుతామంటూ బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంచితే, కేశవస్వామిపేటకు చెందిన యానాది సామాజికవర్గానికి చెంది పలు పొదుపు సంఘాల సభ్యులను మోసం చేసిన ఆర్పీపై చర్యలు లేకపోవడం, తాజాగా పేర్నమిట్టకు చెందిన ఆర్పీ బాధిత పొదుపు సంఘాల పట్ల ఇదే తీరుతో మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది. ఇప్పటికైనా మెప్మాలో అవినీతికి అడ్డుకట్ట వేస్తారా? ఆ ఆర్పీలపై చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

మెప్మాలో ’బోగస్‌ భాగోతం’పై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు

గత వైసీపీ పాలనలో ఇబ్బడిముబ్బడిగా బోగస్‌ గ్రూపులు సృష్టించి సుమారు రూ.40 కోట్ల మేరదోచుకోగా, ఈ ఏడాది జనవరి నుంచి కూడా ఆ వ్యవహారం మళ్లీ మొదలైంది. ఇదిలా ఉంచితే మూడు నెలల క్రితం యానాది సామాజికవర్గం సభ్యులు ఆర్పీ తమను మోసం చేసిందంటూ రోడ్డెక్కగా.. తాజాగా పేర్నమిట్టకు చెందిన ఆర్పీ, దామచర్ల జనార్దన్‌ కాలనీకి చెందిన పొదుపు మహిళలు బయటకొచ్చారు. తమను మోసం చేసి, వారి పేరుతో నకిలీ గ్రూపులు తయారు చేసి రుణాలు తీసుకుందని విమర్శించారు. దీనిపై ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఈ వ్యవహారం ఇటు కార్యాలయ ఉద్యోగుల్లోనే కాకుండా, అటు మెప్మా కేంద్ర కార్యాలయంలోనూ చర్చనీయాంశంగా మారింది. అసలు అక్కడ ఏమి జరుగుతోంది.. అధికారులు ఏమి చేస్తున్నారు.. అనే విషయాలను ఆరా తీస్తుంది.

రాష్ట్రప్రభుత్వం ఇంటికో మహిళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పలు పథకాలు అమలు చేస్తోంది. ఈ వాహనం,తృప్తి క్యాంటీన్‌, వీధి వ్యాపారాలకు ప్రోత్సాహం, హ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌, ఆహార తయారీ, రిటైల్‌ దుకాణాలు, డీజీ లక్ష్మి పథకంతో సేవా రంగాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాలు ప్రతి పొదుపు మహిళకు చేరువ చేయాల్సి ఉందని, కానీ ఆ పథకాల పురోగతి మరిచి, ఆర్పీలు అవినీతికి పాల్పడటంపై శనివారం ఎండీ తేజభరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోగస్‌ గ్రూపులపై సమగ్ర విచారణ చేయాలని పీడీని ఆదేశించారు. అలాంటి వారిని నిర్మొహమాటంగా తొలగించి, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 10:21 PM