ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమ్మనబ్రోలులో ఏం జరిగింది?

ABN, Publish Date - May 06 , 2025 | 01:41 AM

తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసు దర్యాప్తు చివరి దశకు చేరింది. హంతక ముఠాకు నాయ కత్వం వహించిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో సోమవారం విచారణను ముమ్మరం చేశారు. తదనుగుణంగా ఆయా ఘటనలకు సంబంధిం చి ప్రత్యక్ష సాక్షులను విచారించి వారి స్టేట్‌మెం ట్లను రికార్డు చేశారు.

వీరయ్య హత్య జరిగిన భవనం (ఫైల్‌)

ప్రత్యక్ష సాక్షులను విచారించిన పోలీసులు

హంతకముఠా నేత నుంచి ముఖ్య సమాచారం

చివరి దశలో వీరయ్య హత్యకేసు దర్యాప్తు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసు దర్యాప్తు చివరి దశకు చేరింది. హంతక ముఠాకు నాయ కత్వం వహించిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో సోమవారం విచారణను ముమ్మరం చేశారు. తదనుగుణంగా ఆయా ఘటనలకు సంబంధిం చి ప్రత్యక్ష సాక్షులను విచారించి వారి స్టేట్‌మెం ట్లను రికార్డు చేశారు. ముఠాకు నాయకత్వం వహించిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వీరయ్య చౌదరి స్వగ్రామమైన అమ్మనబ్రోలులో అసలేం జరిగింది? పూర్వాపరాలు.. హంతక ముఠాకు హైదరాబాద్‌లో ఉన్న వ్యాపారి, మండలంలో ఉన్న రేషన్‌ మాఫియా డాన్‌కు ఉన్న సంబంధాలపై సోమవారమంతా ఆరా తీశారు.

కీలక సమాచారం రాబట్టిన పోలీసులు

వీరయ్య హత్య కేసులో సూత్రధారులు ఎంత మంది ఉన్నప్పటికీ ప్రధాన పాత్రధారుడిగా గుర్తించిన ఇసుక వ్యాపారిని పోలీసులు పట్టు కోగలిగినట్లు తెలిసింది. నెల్లూరుతో అతనికి ఉన్న సంబంఽధాల నేపథ్యంలో అక్కడ పని చేస్తున్న ఒక డీఎస్పీ.. నిందితుడిని అదుపులోకి తీసుకుని జిల్లా పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. విచారణలో ఇసుక వ్యాపారి పలు అంశాలను వెల్లడించినట్లు తెలిసింది. ఆయన ఇచ్చిన సమాచా రానికి అనుగుణంగా లోతైన దర్యాప్తునకు పోలీసులు దిగారు. అమ్మనబ్రోలు సమీపంలో రొయ్యల చెరువుల నిర్వహణ, కనపర్తి నుంచి ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన అంశాల్లో హతుడు వీరయ్యకు, సూత్రధారులకు మధ్య వివాదం పెరిగినట్లు గుర్తించారు. అమ్మనబ్రోలుకు చెందిన లిక్కర్‌ వ్యాపారి రొయ్యల చెరువులకు గుండ్లకమ్మ నుంచి మంచినీటిని మళ్లిస్తూ చెరువుల్లో నుంచి వచ్చే వృథా నీటిని పొలాల్లోకి వదులుతున్నట్లు తాము వీరయ్య దృష్టికి తీసుకెళ్లామని, ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వీరయ్య మాట్లాడటంతో కలెక్టరు వెంటనే వాటిని నిలిపివేయించినట్లు వారు చెప్పారు. దీంతో ప్రత్యర్థులు కసి పెంచు కున్నారు. అలాగే హంతక ముఠా నాయకుడు ఇచ్చిన సమాచారం మేరకు కనపర్తి నుంచి ఇసుక అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారు, ఎవరు అడ్డుకున్నారన్న విషయం పైనా పోలీసులు విచారణ చేపట్టారు. హంతక ముఠాకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తే ఇసుక వ్యాపారి. ఆయన అమ్మనబ్రోలులో వీరయ్య వ్యతిరేకులతో కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసింది. దాన్ని అధికారులతో తనకున్న పరిచయాలను ఉపయోగించి వీరయ్య ఆపివేయించినట్లు పోలీసుల విచారణలోనూ నిర్ధారణ అయినట్లు తెలిసింది.


పలు విషయాలు కొలిక్కి

హైదరాబాద్‌లో ఉన్న అమ్మనబ్రోలుకు చెం దిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇచ్చిన భరోసా, ఆర్థిక సహకారం కిందిస్థాయిలో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, మరోవైపు రేషన్‌ మాఫియా డాన్‌ వీరికి తోడైనట్లు సమాచారం. హంతక ముఠాకు నాయకత్వం వహించిన ఇసుక వ్యాపారి పాత్రపై నిర్ధిష్ట సమాచారాన్ని ఈ రెండు రోజుల్లో పోలీసులు సాధించగలిగి నట్లు తెలిసింది. వీరికున్న రాజకీయ నేపథ్యాన్ని ఇప్పటికే గుర్తించారు. బుధవారం వీరయ్య పెద్దకర్మ జరుగుతోంది. ఈనేపథ్యంలో వచ్చే 24 గంటల వ్యవధిలో కేసు ప్రాథమిక దర్యాప్తును ఒక కొలిక్కి తేవాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన అంశాలను వెల్లడించి వారి అదుపులో ఉన్న సూత్రధారులు, పాత్రధారుల అరెస్టులు చూయించి తదుపరి దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Updated Date - May 06 , 2025 | 01:41 AM