ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎత్తిపోతలను వినియెగంలోకి తెస్తాం

ABN, Publish Date - Mar 19 , 2025 | 12:11 AM

ఎన్నో ఏళ్లగా మరమ్మతులకు గురై నిరుపయెగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను వినియెగంలోకి తీసుకు వచ్చే చర్యలు చేపడుతున్నామని నీటి పారుదల శాఖ (ఐడీసీ) ఈఈ సిరాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. మంగళవారం బల్లికురవ మండలం గుంటుపల్లి, అంబడిపూడి, నక్కబొక్కలపాడు, కొణిదెన, కోటవారిపాలెం, ఉప్పుమాగులూరు, సంతమాగులూరు మండలం సజ్జాపురం, తంగేడుమల్లి, కామేపల్లి, పెట్లూరివారిపాలెం గ్రామాలలో ఉన్న ఎత్తిపోతల పథకాలను ఐడీసీ అధికారులు పరిశీలించారు.

ఉప్పుమాగులూరులో రైతులతో మాట్లాడుతున్న అధికారులు

నిరుపయెగంగా ఉన్న పథకాలను

పరిశీలించిన ఐడీసీ అధికారులు

బల్లికురవ. మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : ఎన్నో ఏళ్లగా మరమ్మతులకు గురై నిరుపయెగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను వినియెగంలోకి తీసుకు వచ్చే చర్యలు చేపడుతున్నామని నీటి పారుదల శాఖ (ఐడీసీ) ఈఈ సిరాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. మంగళవారం బల్లికురవ మండలం గుంటుపల్లి, అంబడిపూడి, నక్కబొక్కలపాడు, కొణిదెన, కోటవారిపాలెం, ఉప్పుమాగులూరు, సంతమాగులూరు మండలం సజ్జాపురం, తంగేడుమల్లి, కామేపల్లి, పెట్లూరివారిపాలెం గ్రామాలలో ఉన్న ఎత్తిపోతల పథకాలను ఐడీసీ అధికారులు పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాలలో ఉన్న పథకాలను వినియెగంలోకి తెచ్చేలా అవసరమైన నిధులపై ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎత్తిపోతల పథకాలు పని చేసేలా ప్రణాళిక మేరకు నిధులు మంజూరు చేయిస్తామని వారు తెలిపారు. కొన్ని గ్రామాల్లో కొంతకాలంగా పథకాలు పనిచేయడం లేదని ఈ విషయాన్ని ప్రభు త్వం గమనించి అన్ని పథకాలను పరిశీలించి నివేదికలు అందించాలని ఆదేశాలు ఇచ్చిందని వారు తెలిపారు. ఆనంతరం వారు గ్రామాలలో రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో ఏఈలు కృష్ణారావు, వంశీకృష్ణ, విజయభాస్కర్‌, నీటి సంఘాల అధ్యక్షులు కోయ పేరయ్య, కక్కెర సుబ్బారావు, దద్దాల విజయ్‌, దర్శి రామస్వామి పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:11 AM