పొగాకు నిల్వలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తాం
ABN, Publish Date - Jul 25 , 2025 | 12:50 AM
రైౖతుల వద్ద నిల్వ ఉన్న నల్లబర్లీ పొగాకును పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చీరాల ఆర్‌డీవో చంద్రశేఖర్ నాయుడు అన్నారు.
పంగులూరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): రైౖతుల వద్ద నిల్వ ఉన్న నల్లబర్లీ పొగాకును పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చీరాల ఆర్‌డీవో చంద్రశేఖర్ నాయుడు అన్నారు. మండలంలోని తూర్పుకొప్పెర పాడులోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆర్‌డీవో చంద్రశేఖరనాయుడు గురువారం సాయంత్రం పరిశీ లించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం పంగులూ రు రెవెన్యూ కార్యాలయ సిబ్బందితో సమావేశమ య్యారు. పొగాకు కొనుగోళ్ల విషయమై స్థానిక విలే కర్లతో మాట్లాడారు. నల్లబర్లీ కొనుగోళ్ల విషయంలో రైతులు, అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేపడతామన్నారు. తూర్పు కొప్పెరపాడులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద గోడౌన్ మూడురోజులకే నిండిందన్నారు. దీంతో శుక్రవారం నుంచి కొనుగోలు కేంద్రాన్ని అద్దంకి మార్కెట్ యార్డ్‌కు మార్చుతున్నట్లు ఆర్డీవో తెలిపారు. రైతులు తాము తరలించే పొగాకు బేళ్లకు సంబంధించి రవాణా ఖర్చులు చెల్లించే విషయం ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా నల్లబర్లీ పొగాకు మొత్తం ప్రభుత్వం తప్పక కొనుగోలు చేస్తుందన్నారు. అనంతరం జాతీయ రహదారి పక్కన ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను ఆర్‌డీవో చంద్రశేఖరనాయుడు పరిశీలించారు. ప్రభుత్వ భూమి ఉన్నచోట తగు సమాచారంతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ సింగారావును ఆదేశించారు. కార్యక్రమంలో సర్వేయర్ శ్రీనివాసరావు, ఆర్.ఐ.శ్వేత, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, వీఆర్‌వోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంకొల్లు : రైతులు వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకును వేగంగా కొనుగోలు చేయాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖరనాయుడు అధికారులను ఆదేశించారు. ఇంకొల్లు మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న పొగాకు కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. చివరి ఆకు వరకు పొగాకును పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటివరకు 32.5 టన్నుల పొగాకును కొనుగోలు చేశామన్నారు. రైతులు ఎవరూ అందోళన చెందనవసరం లేదన్నారు. ఆయన వెంట తహసీల్ధారు శ్రీనివాస్, ఏవో మీరమ్మ, పీఏసీఎస్ సిబ్బంది ఉన్నారు.
పొగాకు కొనుగోలు కేంద్రం పరిశీలన
చినగంజాం : చినగంజాంలోని పర్చూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్‌లో నిర్వహిస్తున్న నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని స్సెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్నా, మార్క్‌ఫెడ్ జిల్లా డీ.ఎం. కరుణశ్రీలు గురువారం ఆకస్మికంగా సందర్శించి, పొగాకు కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. తగిన నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం పరిశీలించి కొనుగోళ్లు సజావుగా జరిగేట్లు చూడాలని సిబ్బందిని ఆదేశించారు. తేమ శాతం 18-20 మధ్య ఉండాలని, పైఆకు, మధ్యస్థ ఆకులు గ్రేడ్ చేయాలని సూచించారు. 20 క్వింటాళ్ల లోపు ఉన్న చిన్న, సన్న కారు రైతుల ఉత్పత్తులను ముందుగా కొనుగోలు చేయాలన్నారు. మండలంలో ఇప్పటి వరకు 49 మంది రైతుల దగ్గర 900 క్వింటాల పొగాకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామన్నారు. రైతులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, మార్క్‌ఫెడ్ మేనేజర్ వెంకట్, ఏవో ఆర్.చంద్రశేఖర్, చింతగుంపల్లె పీఏసీఎస్ సీఈవో శేఖర్, టీడీపీ నాయకులు కొండ్రగుంట శ్రీహరి, కొనుగోలు కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 12:50 AM