మార్కాపురం జిల్లాపై మాట నిలబెట్టుకుంటాం
ABN, Publish Date - Jul 19 , 2025 | 11:58 PM
మార్కాపురం జిల్లా చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నా రు.
మంత్రి స్వామి
మార్కాపురం రూరల్, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లా చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నా రు. మండలంలోని బోడపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ.35లక్షలతో నూ తనంగా నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి స్వామి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రామ సెంటర్‌లో జరిగిన సమావేశంలో మంత్రి స్వామి మాట్లాడుతూ ప్రజా ప్ర భుత్వ పాలనలో ప్రతి పేదకూ న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకులు కం దుల రామిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటరెడ్డి, బోడపాడు నాయకులు బొగ్గు శేఖర్‌రెడ్డి, జవ్వాజి రామాంజులరెడ్డి, నీటి సంఘం చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వక్కలగడ్డ మల్లికార్జున, డీలర్ రామకృష్ణారెడ్డి, కందుల పరమేరశ్వరరెడ్డి, యువనాయకులు ఆనెకాళ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
తర్లుపాడు : ప్రజా సంక్షేమమే ప్ర భుత్వ లక్ష్యమని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.50లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు భ వనాన్ని మంత్రి ఎమ్మెల్యే కందుల నారా యణరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.9కోట్లతో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో భవనాలు నిర్మించామన్నారు. త్వరలో రూ.25లక్షల వరకు వైద్యం అందించేలా గొప్ప ఇన్సూరెన్స్ పాలసీని ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సీతానాగులవరంలో రూ.25లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు మంత్రి, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తున్న కందులను రైతులకు పంపిణీ చేశారు. తర్లుపాడులోని ఎస్సీ పాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను మంత్రి, ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లచ్చా నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఎమ్మార్వో కె.కిశోర్ కుమార్, పంచాయితీరాజ్ ఈఈ శ్రీనివాసులు, డీఈ రవిప్రకాశ్, ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్, టీడీపీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపురెడ్డి, వి.మల్లికార్జున, పి.గోపినాథ్, నాయకులు పాల్గొన్నారు.
ప్రజలు మెచ్చిన పాలన .. టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు
పెద్దదోర్నాల : ప్రజలు మెచ్చిన ప్ర భుత్వ పాలన సాగుతోందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నా రు. పాత ఫోస్టాఫీస్ వీధిలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని శనివా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా ఎరిక్షన్ బాబు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ ఏడాది పాలనను ప్రజల కు వివరించారు. మురుగు కాలువలు సక్రమంగా లేవని స్థానికులు చెప్పగా సమస్యను పరిష్కరించాలని కార్యదర్శికి సూచించారు. కార్యక్రమంలో నాయకులు మాబు, సుధాకర్‌రెడ్డి, శేషాద్రి, మల్లయ్య,మాజీ సర్పంచి హరగోపాల్, చంటి, షేక్ సమ్మద్ బాషా, నాగేంద్రబాబు, వెంకటేశ్వర్లు, షేక్ రఫి, షేక్ మంజూర్‌బాషా, సు బ్బారెడ్డి, షేక్ ఇస్మాయిల్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మురళి, బీజేపీ నాయకులు గండి వీరారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 11:58 PM