ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పార్టీ పటిష్టతకు నిబద్ధతతో పనిచేయాలి

ABN, Publish Date - Jun 27 , 2025 | 12:24 AM

పార్టీ పదవులు పొందిన నాయకులు నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేసి పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఎస్‌వీకేపీ కాలేజీకి సమీపంలోని వక్కలగడ్డ అపార్ట్‌మెంట్‌లో గురువారం మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తల స మావేశం జరిగింది.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

ఎమ్మెల్యే నారాయణరెడ్డి

మార్కాపురం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): పార్టీ పదవులు పొందిన నాయకులు నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేసి పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఎస్‌వీకేపీ కాలేజీకి సమీపంలోని వక్కలగడ్డ అపార్ట్‌మెంట్‌లో గురువారం మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తల స మావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు కనుమూరి బాజీచౌదరి, ఎమ్మెల్యే కందుల ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ చిన్నపాటి ఒడిదొడుకులు ఉన్నా అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలన్నారు. పార్టీ పదవులు రానివాళ్లు నిరాశ చెందవద్దని, ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉం టుందన్నారు. టీడీపీ కార్యకర్తలంటే క్రమశిక్షణకు మారుపేరన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుంటే వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నా రు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రూ.20వేల సాయం కూడా త్వరలోనే అమలవుతుందన్నారు. ఒక్క అవకాశం అంటూ జగన్‌ రెడ్డి రాష్ట్రాన్ని రూ.6లక్షల కోట్ల అప్పులఊబిలోకి నెట్టారన్నారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిబాట పట్టించేందుకు తీవ్రంగా కష్టించాల్సి వస్తోందన్నారు. గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. నియోజకవర్గం మొత్తం రూ.390 కోట్లతో ఇంటింటికీ పైప్‌లైన్‌ పనులు జరుగనున్నాయన్నారు. త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. అంతేకాక మార్కాపురం జిల్లాను కూడా ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. జూలై 2 నుంచి గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం చేసిన మంచిని వివరించడమేకాకుండా, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పరిశీలకులు బాజీ చౌదరి పర్యవేక్షణలో నియోజకవర్గంలోని అన్ని మండల కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, మాలపాటి వెంకటరెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు దగ్గుల శ్రీనివాసరెడ్డి, కాకర్ల శ్రీనివాసులు, షేక్‌ షెక్షావలి, పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌, దూదేకుల మస్తానయ్య, కొప్పుల శ్రీనివాసులు, మట్టం వెంకటేశ్వర్లు, జవ్వాజి రామాంజులరెడ్డి, గొలమారి నాసర్‌రెడ్డి, ఉడుముల చిన్నపరెడ్డి, కాశయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:24 AM