ఏడాదిలో ఎంతో చేశాం
ABN, Publish Date - Jul 21 , 2025 | 10:40 PM
కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మండలంలోని తూర్పువీరాయపాలెంలో సోమవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమ నిర్వహించారు.
ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నాం
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, జూలై 21(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మండలంలోని తూర్పువీరాయపాలెంలో సోమవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమ నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్‌సాగర్ దంపతులు టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయమంగా ముందుకు సాగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తున్నట్టు చెప్పారు. తమ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకులు అవినీతి కేసుల్లో కూరుకుపోయి జైళ్లకు క్యూ కడుతున్నారని విమర్శించారు. లిక్కర్ స్కాంలో రూ.3500 కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో పెద్ద తమింగలాలు కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఏఎం సీ చైర్‌పర్సన్ దారం నాగవేణి, టీడీపీ మండల అధ్యక్షు డు మారెళ్ల వెంకటేశ్వర్లు, ముప్పరాజ వెంకటేశ్వర్లు, మదుమంచి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 21 , 2025 | 10:40 PM