వేధింపులు తాళలేక భర్తను హత్య చేసిన భార్య
ABN, Publish Date - May 04 , 2025 | 11:25 PM
వేధింపులు తాళలేక భర్తను భార్య హత్య చేసింది. ఆపై హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబడిన ఘటన కంభం పట్టణం కాపవీధిలో చోటుచేసుకుంది.
సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నం
కంభం, మే 4 (ఆంధ్రజ్యోతి): వేధింపులు తాళలేక భర్తను భార్య హత్య చేసింది. ఆపై హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబడిన ఘటన కంభం పట్టణం కాపవీధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరసింహారావు కథనం ప్రకారం... కంభం కాపవీధిలో షేక్ వలి(45), భార్య రిజ్వాన ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. వలి పెయింటర్‌గా పనిచేస్తున్నారు. వలి ప్రతిరోజూ మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈనేపథ్యంలో శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన వలికి, భార్య రిజ్వాన మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో మంచంపై పడుకుని ఉన్న వలి మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా హత్య చేసింది. అనంతరం సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. మద్యం అతిగా సేవించి గొంతు ఎండి చనిపోయాడని తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు రిజ్వానాను లోతుగా విచారించడంతో భర్త వేధింపులు తాళలేక తానే హత్య చేసినట్లు అంగీకరించింది. మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ మల్లికార్జున ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - May 04 , 2025 | 11:25 PM