ట్రిపుల్ ఐటీ ఒంగోలులోనే...
ABN, Publish Date - May 23 , 2025 | 12:17 AM
ఒంగోలు ట్రిపుల్‌ఐటీ కళాశాల ఎక్కడికీ తరలిపోవడం లేదని, ఒంగోలులోనే కొనసాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్‌సబీవీ స్వామి స్పష్టంచేశారు.
మంత్రి డాక్టర్ స్వామి
ఒంగోలు విద్య, మే 22 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు ట్రిపుల్‌ఐటీ కళాశాల ఎక్కడికీ తరలిపోవడం లేదని, ఒంగోలులోనే కొనసాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్‌సబీవీ స్వామి స్పష్టంచేశారు. గురువారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి నివాసంలో ట్రిపుల్‌ఐటీపై సమీక్ష నిర్వహించారు. ట్రిపుల్‌ఐటీ తరలిపోతుందని పత్రికల్లో వచ్చిన కథనాలు అభూత కల్పన అని మంత్రి తోసిపుచ్చారు. ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు క్యాంప్‌సను కొనసాగించేందుకు, లీజు అగ్రిమెంట్ పొడిగించేందుకు ఆ కళాశాల యాజమాన్యం అంగీకరించకపోవడంతో ఆ క్యాంప్‌సను మూసివేయాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందిలేదని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రావ్‌అండ్ నాయుడు క్యాంప్‌సలోని ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం తరగతులకు ఎస్‌ఎ్‌సఎన్ క్యాంప్‌సకు తరలివెళ్లారన్నారు. ప్రస్తుత 2025-26 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించి కొత్త విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్‌ఐటీలో వసతి కల్పిస్తున్నామని చెప్పారు. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇడుపులపాయకు వెళ్తారన్నారు. అక్కడే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత 2, 3, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్సుకు ఒంగోలుకు వస్తారని మంత్రి వెల్లడించారు. 2017లో ఏర్పాటైన ఒంగోలు ట్రిపుల్‌ఐటీకి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సొంత భవనాలను పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం తాత్కాలిక వసతి కోసం ప్రయతిస్తున్నామని చెప్పారు. స్థల సేకరణ, నిధులపై కలెక్టర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. కొత్తభవనాలు నిర్మించే వరకు ఈ సర్దుబాటు కొనసాగుతోందన్నారు. నిధుల కోసం సీఎం, విద్యాశాఖమంత్రితో మాట్లాడతామని తెలిపారు. ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ భాస్కర్ పటేల్, డీన్ రూప్‌సకుమార్‌లు ఉన్నారు.
Updated Date - May 23 , 2025 | 12:17 AM