అమరవీరుడు మురళీనాయక్‌కు నివాళి
ABN, Publish Date - May 10 , 2025 | 11:36 PM
భారత సైనికుడు మురళీనాయక్ మృతికి శనివారం ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు నివాళులర్పించారు. జోహార్ ముళీనాయక్ అంటూ ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం, మే 10 ( ఆంద్రజ్యోతి) : భారత సైనికుడు మురళీనాయక్ మృతికి శనివారం ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు నివాళులర్పించారు. జోహార్ ముళీనాయక్ అంటూ ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గిరిజన సంఘం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ
మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని నియోజకవరక్ష గిరిజన సంఘం నాయకులు శనివారం శాంతీ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు మాజీ ఎంపీపీ మంత్రునాయక్, సర్పంచి అరుణాబాయ్, గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పెద్ద దోర్నాల : యుద్ధంలో అసువులు బాసిన అమరవీరుడు మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మహంత్ నాయక్, కాశీరాం నాయక్, లాలూ నాయక్ గాలే నాయక్, బీజేపీ నాయకులు టీ శ్రీరాంరెడ్డి, ఎంఆర్‌పీఎస్ నాయకులు నాగభూషణం పాల్గొన్నారు.
Updated Date - May 10 , 2025 | 11:36 PM