ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బదిలీల టెన్షన్‌

ABN, Publish Date - Mar 18 , 2025 | 01:39 AM

డ్వామాలో ఎట్టకేలకు మార్పు మొదలైంది. ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

ఏళ్లతరబడి పాతుకుపోయిన డ్వామా ఉద్యోగులు కదలాల్సిందే!

ఏపీడీ నుంచి కంప్యూటర్‌ ఆపరేటర్‌ వరకు మూడేళ్లు దాటితే స్థానచలనం

ఐదేళ్లు అయితే తప్పనిసరిగా మార్పు

పూర్తిస్థాయిలో ప్రక్షాళనతోనే ఫలితం

త్రిసభ్య కమిటీ నివేదికపై చర్యలు కూడా కొలిక్కి

డ్వామాలో ఎట్టకేలకు మార్పు మొదలైంది. ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. డ్వామాలో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అంతా గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆపార్టీ కీలక నేతల సిఫార్సులతో నియమితులైన వారే. ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయి అవినీతి, అక్రమాలతో భారీ ఎత్తున ఆర్జించారు. అలాంటి అనేక మంది ఆ శాఖలో వివిధ స్థాయిల్లో ఉన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో క్షేత్రస్థాయిలో ఆ సంస్థ తరఫున పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లు మినహా మిగతా వారంతా మారనున్నారు. దీంతో ఎంత దూరం వెళ్లాల్సి వస్తుందోనన్న భయం కొందరు ఉద్యోగుల్లో కనిపిస్తోంది.

ఒంగోలు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా స్థాయిలో ఉపాధి హామీ పథకం పర్యవేక్షకులు అయిన నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ బదిలీ జరిగి కొత్తగా జి.జోసఫ్‌కుమార్‌ వచ్చారు. మిగిలిన వారిలో ఇంచుమించు అందరూ గతం నుంచి ఆయా పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఏపీవో, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లు (ఈసీ), కంప్యూటర్‌ ఆపరేటర్లు కలిసి ఒక్కో మండలంలో పది మంది వరకు ఉంటారు. క్లస్టర్‌ స్థాయిలో ఏపీడీ, కార్యాలయ సిబ్బంది, వివిధ చోట్ల ఉన్న శిక్షణ కేంద్రాలు (సీఎల్‌ఆర్‌సీ సెంటర్స్‌)తోపాటు డ్వామా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరిలో ప్రభుత్వ రెగ్యులర్‌ ఉద్యోగులు ఉండేది చాలా తక్కువ. డ్వామా జిల్లా కార్యాలయంలో పంచాయతీరాజ్‌, ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన వారితోపాటు కొందరు ఏపీడీలు మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులు. మిగిలిన 95శాతం మంది నిర్ధిష్ట కాల పరిమితి (ఎఫ్‌టీఈ), అలాగే ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. మూడొంతుల మంది దీర్ఘకాలంగా ఆయా పోస్టుల్లో పాతుకుపోయారు.

నాలుగేళ్లుగా బదిలీలు లేవు

నాలుగేళ్ల క్రితం ఒక స్థాయిలో బదిలీలు జరగ్గా అనంతరం లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలకమైన డ్వామా సిబ్బందిని బదిలీ చేయాలని టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేవంటూ జిల్లాస్థాయిలో బదిలీలు నిర్వహించలేదు. దీంతో ఎక్కడి వారు అక్కడే పనిచేస్తున్నారు. కొంతమందిపై పెద్దఎత్తున అవినీతి, ఇతర ఆరోపణలు వస్తున్నప్పటికీ కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం డ్వామా ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈనెల 20లోపు జిల్లా పరిధిలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ పలు మార్గదర్శకాలను ఇచ్చింది. ఆ ప్రకారం అన్ని స్థాయిల్లోని వారు మూడేళ్లు ఒకేచోట పనిచేస్తే వారిని బదిలీ చేయవచ్చు. అదే ఐదు సంవత్సరాలు ఒకేచోట పనిచేస్తుంటే తప్పనిసరిగా స్థాన చలనం కల్పించాలి.

ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఏపీడీలు..

క్లస్టర్‌ పర్యవేక్షకులైన అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఏపీడీ)లను పూర్వపు జిల్లా యూనిట్‌గా, మండల స్థాయి పర్యవేక్షకులుగా ఉండే ఏపీవోలను ప్రస్తుత జిల్లా యూనిట్‌గా బదిలీలు చేయనున్నారు. ఇతర ఉద్యోగులను క్లస్టర్‌ స్థాయిలో, జిల్లా కార్యాలయంలో పనిచేసే వారిని ఐదేళ్లు దాటితే క్లస్టర్‌కు, మూడేళ్లు దాటితే అదే కార్యాలయంలో స్థానాల మార్పునకు అవకాశం ఇచ్చారు. ఏటా వందల కోట్ల రూపాయల ఉపాధి, మెటీరియల్‌ కోటా నిధులతో ఇతరత్రా పనులు డ్వామా పరిధిలో జరుగుతుండగా అక్రమార్జనకు అంతు లేకుండా పోయింది. స్థానికంగా రాజకీయ నాయకులలోనూ ఈ సంస్థ ఉద్యోగులకు అత్యంత ప్రాధాన్యం ఉంటోంది. దీంతో ఎవరికి వారు తమకు అనుకూల స్థానాలను ఎంపిక చేసుకొని కొనసాగుతుండగా ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు, అందులోని మార్గదర్శకాలతో ఆయా ఉద్యోగులు టెన్షన్‌ పడుతున్నారు.


గత అక్రమాలపై చర్యలకు సిద్ధం

గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైసీపీ నేతల సూచనలకు అనుగుణంగా అప్పటి పీడీ శీనారెడ్డి ఇష్టారీతిన బదిలీలతోపాటు పెద్దసంఖ్యలో డిప్యుటేషన్లు వేశారు. పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా అలా చేసిన విషయాన్ని శీనారెడ్డి అక్రమాలపై విచారణ చేసిన డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు కమిటీ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో గతంలో వేసిన డిప్యుటేషన్లను రద్దుచేయడంతోపాటు అప్పట్లో ఇష్టారీతిన జరిగిన బదిలీలను పరిశీలించి ప్రస్తుత బదిలీల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పీడీ జోసఫ్‌కుమార్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇదేసమయంలో లోకేశ్వరరావు కమిటీ ఇచ్చిననివేదికపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ నివేదికపై దాదాపు నెలన్నర రోజులుగా పీడీ జోసఫ్‌కుమార్‌ నేతృత్వంలో డ్వామా కార్యాలయ సిబ్బంది పరిశీలన చేసి కొందరిపై చర్యలకు కలెక్టర్‌కు నివేదిస్తున్నట్లు తెలిసింది. బదిలీల కన్నా ముందుగానే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద డ్వామా ఉద్యోగులలో బదిలీల టెన్షన్‌ బాగతా కనిపిస్తోంది.

Updated Date - Mar 18 , 2025 | 01:39 AM