ఇరువురు తహసీల్దార్ల బదిలీ
ABN, Publish Date - May 12 , 2025 | 01:44 AM
ల్లాలో ఇద్దరు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఇరువురు డీటీలకు తహసీల్దార్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మరో ఇద్దరు డీటీలకు అడ్‌హక్ ఉద్యోగోన్నతి కల్పించారు. ఈమేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇద్దరు డీటీలకు అడ్‌హక్ ఉద్యోగోన్నతులు
మరో ఇద్దరికి పూర్తి అదనపు బాధ్యతలు
ఒంగోలు కలెక్టరేట్, మే 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఇరువురు డీటీలకు తహసీల్దార్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మరో ఇద్దరు డీటీలకు అడ్‌హక్ ఉద్యోగోన్నతి కల్పించారు. ఈమేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపట్నం తహసీల్దార్‌గా పనిచేస్తున్న పిన్నిక మధుసూదనరావును ఒంగోలు అర్బన్‌కు, ప్రస్తుతం ఆస్థానంలో పనిచేస్తున్న వాసును వెలిగండ్లకు బదిలీ చేశారు. గిద్దలూరు తహసీల్దార్ ఎం.ఆంజనేయరెడ్డి అనారోగ్యంతో సెలవు పెట్టడంతో అక్కడి డీటీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎస్‌పురం డీటీకి అక్కడ తహసీల్దార్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలోని వలేటివారిపాలెం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎస్‌కే నాయబ్‌రసూల్‌ను ఒంగోలు రూరల్‌కు, ఒంగోలు రూరల్ డీటీగా పనిచేస్తున్న ఎస్.శ్రీనివాసరావును నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం తహసీల్దార్‌గా నియమించారు.
Updated Date - May 12 , 2025 | 01:44 AM