ఏడుగురు తహసీల్దార్ల బదిలీ
ABN, Publish Date - Apr 27 , 2025 | 01:09 AM
జిల్లాలో ఏడుగురు తహసీల్దార్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వారిలో నలుగురిని పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తున్న ఇరువురికి అడ్‌హక్ ఉద్యోగోన్నతులు కల్పించారు.
ఇరువురికి అడ్‌హక్ ఉద్యోగోన్నతి
సస్పెన్షన్‌లో ఉన్న ఒకరికి పోస్టింగ్
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఏడుగురు తహసీల్దార్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వారిలో నలుగురిని పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తున్న ఇరువురికి అడ్‌హక్ ఉద్యోగోన్నతులు కల్పించారు. మూడు నెలల క్రితం సస్పెండ్ అయిన కనిగిరి తహసీల్దార్‌కు తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. సీఎస్‌పురం తహసీల్దార్‌గా పనిచేస్తున్న డి.మంజునాథరెడ్డిని ఎర్రగొండపాలెం, మార్కాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న కె.రవీంద్రారెడ్డిని సీఎస్‌పురం తహసీల్దార్‌గా బదిలీ చేశారు. కలెక్టరేట్‌లో ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌ఎల్.నారాయణరెడ్డిని మద్దిపాడు తహసీల్దార్‌గా, దొనకొండలో పనిచేస్తున్న జగదీశ్వరరావును కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ జిల్లా ఆడిట్ సూపరింటెండెంట్‌గా నియమించారు. కనిగిరి తహసీల్దార్‌గా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన సిహెచ్.అశోక్‌కుమార్‌రెడ్డిని పెండింగ్ విచారణ కింద రాచర్ల తహసీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. హెచ్‌ఎంపాడులో డీటీగా పనిచేస్తున్న కె.కిషోర్‌కుమార్‌ను అడ్‌హక్ ఉద్యోగోన్నతిపై తర్లుపాడు, పొన్నలూరు డీటీగా పనిచేస్తున్న కె.వెంకటేశ్వరరావును పుల్లలచెరువు తహసీల్దార్‌గా నియమించారు.
Updated Date - Apr 27 , 2025 | 01:09 AM