ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళల ఆర్థికాభివృద్ధికి శిక్షణ

ABN, Publish Date - Jul 24 , 2025 | 11:21 PM

గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, యువతుల భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణ తరగతులు ఉత్సాహంగా సాగుతున్నాయి.

శిక్షణ కేంద్రంలో కుట్టును నేర్చుకుంటున్న మహిళలు

90 రోజుల పాటు కట్టు మిషన్‌పై ఉచిత తర్ఫీదు

అనంతరం పంపిణీ

ఉత్సాహంగ నేర్చుకుంటున్న వైనం

ఎర్రగొండపాలెం రూరల్‌, జులై 24 (ఆంధ్రజ్యోతి) : గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, యువతుల భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణ తరగతులు ఉత్సాహంగా సాగుతున్నాయి. మహిళలు, యువతులు ఆర్ధికంగా వారి కాళ్లమీద వాళ్లు నిలబడి కుటుంబాన్ని పోషించుకోవడంతోపాటు వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు ఉచిత శిక్షణ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలోనూ ఏర్పాటు చేశారు. ఎర్రగొండపాలెం మండల కేంద్రంలోని సచివాలయం 3 భవనంలో ఏప్రిల్‌ 16 టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అధికారులతో కలసి ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు ఈ భవనంలో 40 మందికి శిక్షణ ఇస్తున్నారు. 90 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని ఎంపీడీవో బీ శ్రీనివాసులు తెలిపారు. శిక్షణ ఆనంతరం వారికి కుట్టు మిషన్లు అందించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో మండలంలోని నలుమూలల గ్రామాల నుంచి మహిళలు, యువతలు ఎంతో ఉత్సాహంగా వచ్చి కుట్టు శిక్షణను నేర్చుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. చక్కటి మెళుకువలు (దుస్తులు కత్తిరింపులు, కుట్లు వేయడం, హుక్సులు, గుండీలు కుట్టడం తదితర వాటిని) నేర్పుతున్నట్లు శిక్షణ పొందుతున్నవారు తెలిపారు. వీరికి అవసరమైన సామగ్రిని ప్రభుత్వమే సమకూర్చుతుంది. 90 రోజుల శిక్షణ అనంతరం వారు సొంతంగా గ్రామాల్లో ఉపాధిని పొందుతూ మరికొందరికి శిక్షణ ఇచ్చుకోవచ్చని తెలిపారు. శిక్షణలో చేరేందుకు వందల సంఖ్యలో దరఖాస్తులు చేసుకోగా, బ్యాచ్‌లవారీగా శిక్షణ తరగతులు ఇస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - Jul 24 , 2025 | 11:21 PM