ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పొగాకు రైతులను ఆదుకోవాలి

ABN, Publish Date - May 14 , 2025 | 12:20 AM

వర్జీనియా, బర్లీ పొగాకు రై తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జి ల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.హనుమారెడ్డి, కె.వీరారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఒంగోలు కలెక్టరేట్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): వర్జీనియా, బర్లీ పొగాకు రై తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జి ల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.హనుమారెడ్డి, కె.వీరారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలై తీవ్ర మనోవేదనతో ఉన్నా పట్టించుకోవడం లే దన్నారు. మినుము, కంది పంటలు అధిక వర్షాల వల్ల నష్టపోగా అరకొర పంట వచ్చినా ధరలు లేవన్నారు. ఇక వర్జీనియా, బర్లీ పొగాకు రైతుల ప రిస్థితి మరింత దారుణంగా ఉందని తెలిపారు. పొగాకు కంపెనీల ప్రతి నిధులు రైతులను ప్రోత్సహించి పంట సాగు చేయించి తీరా కొనుగోలు సమయంలో మొఖం చాటేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అప్పుల బాధలు తట్టుకోలేక ఇప్పటికే ఇద్దరు రైతులు మృతిచెందగా, మరో రైతు ఆత్మహత్యయత్నం చేసుకున్నారన్నారు. పొగాకు కొనుగోలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం గుంటూరులో ఈడీ విశ్వశ్రీ, చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ను కలిసి సమస్యను వివరించనున్నట్లు తెలిపారు. ఇ ప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.

Updated Date - May 14 , 2025 | 12:20 AM