ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పొగాకు రైతులను కోవాలి

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:18 PM

నియోజకవర్గంలో రైతులు పండించిన పొగాకును మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయించి రైతులను ఆదుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కే అచ్చెన్నాయుడిని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు కలసి వినతిపత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు.

పొగాకును కొనుగోలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడికి విజ్ఞప్తి చేస్తున్న ఎరిక్షన్‌బాబు, టీడీపీ నాయకులు

మంత్రి అచ్చెన్నకు ఎరిక్షన్‌బాబు విజ్ఞప్తి

ఎర్రగొండపాలెం జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో రైతులు పండించిన పొగాకును మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయించి రైతులను ఆదుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కే అచ్చెన్నాయుడిని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు కలసి వినతిపత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు. బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంబోత్సవానికి వచ్చిన మంత్రి అచ్చెన్నను ఎరిక్షన్‌బాబు స్థానిక నాయకులతో కలిశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2024.-2025 సంవత్సరాలలో ఎక్కువ మంది రైతులు పొగాకును సాగు చేశారని, రైతుల ఇళ్లల్లో పొగాకు బేళ్లు నిల్వ ఉన్నాయన్నారు. రైతుల నుంచి పొగాకును కొనుగోలు చేసేలా కృషి చేయాలని మంత్రికి ఎరిక్షన్‌బాబు కోరారు. ఆయనవెంట టీడీపీ నాయకులు బీవీ సుబ్బారెడ్డి, గద్దె మల్లయ్య, పుల్లలచెరువు మండల రైతులు ఉన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:18 PM