ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పొగాకు రైతులు నిబంధనలు పాటించాలి

ABN, Publish Date - Jul 19 , 2025 | 12:33 AM

పొగాకు పంట సాగు చేసే రైతులు బోర్డు నిబంధనలు తప్పక పాటించాలని ఆర్‌ఎం శీలం రామారావు కోరారు. ఒంగోలు పొగాకు వేలం కేంద్రం-2లో శుక్రవారం జరుగుతున్న వే లం ప్రకియను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు.

ఒంగోలు(రూరల్‌), జూలై18(ఆంధ్రజ్యోతి): పొగాకు పంట సాగు చేసే రైతులు బోర్డు నిబంధనలు తప్పక పాటించాలని ఆర్‌ఎం శీలం రామారావు కోరారు. ఒంగోలు పొగాకు వేలం కేంద్రం-2లో శుక్రవారం జరుగుతున్న వే లం ప్రకియను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ ఏడాది కొం తమంది రైతులు ఒక బ్యారన్‌కు సాగు చేయాల్సిన పొగాకు పంటను సుమారు నాలుగు బ్యారన్‌లకు సరిపడ స్థాయిలో సాగు చేశారని చెప్పారు. 166 మిలియన్‌ల కిలోల ఉత్పత్తికి రైతులకు అనుమతి ఇస్తే ఏకంగా 240 మిలియన్‌ల కిలోల పొగాకు ఉత్పత్తి చేశారని, దీంతో అమ్మకాల ప్రక్రియలో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందన్నారు.

దీనికితోడు పెట్టుబడులు కూడా పెరగడంతో రైతుకు వచ్చే ఆదాయాలకు గండి పడిందని పేర్కొన్నారు. అధి కంగా పొగాకు పంట సాగు చేయటంతో వ్యాపారులు కొనుగోలు చేసిన ప్పటికీ గోదాముల్లో బేళ్లు స్టాకు చేసుకోవటం కూడా ఇబ్బందిగా మారింద న్నారు. ముఖ్యంగా కౌలు రైతులు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే నష్టాల కు గురికావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పొగాకు అంతర్జాతీయ మార్కెట్‌ పంట అని, ఏ దేశంలో పొగాకు తక్కువ ధరకు వస్తుందో వ్యా పారులు అక్కడే కొంటారని తెలిపారు. ఈ ఏడాది పొగాకు నారుమడులు అవసరం మేరకు మాత్రమే సాగు చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి జె.తులసి, రైతు నాయకులు పెనుబోతు సునీల్‌, క ట్టా హనుమంతరావు, వైవీ.శేషయ్య, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 10:52 AM