త్వరలోనే లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లు
ABN, Publish Date - Jul 07 , 2025 | 01:24 AM
త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ టి డ్కో ఇళ్ళు అందజేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. సుపరిపాలనకు తొలిఅ డుగు కార్యక్రమాన్ని ఆదివారం నగరంలోని 47, 48వ డివిజన్‌లలో నిర్వహించారు.
ఎమ్మెల్యే దామచర్ల వెల్లడి
ఒంగోలు కార్పొరేషన్, జూలై 6 (ఆంధ్ర జ్యోతి): త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ టి డ్కో ఇళ్ళు అందజేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. సుపరిపాలనకు తొలిఅ డుగు కార్యక్రమాన్ని ఆదివారం నగరంలోని 47, 48వ డివిజన్‌లలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికీ వెళ్ళి ప్ర జలతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దామచర్ల మీడియాతో మా ట్లాడుతూగత అవినీతి వైసీపీకి గుణపాఠం చెప్పి, ప్రజలు మెచ్చిన పాలన ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్ళ పేరుతో లబ్ధి దారులకు తెలియకుండా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని దోచుకున్నారని, అయితే ఎవరూ బ్యాంకులకు వడ్డీలు చెల్లిం చవద్దని చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం బ్యాం కులకు వడ్డీ చెల్లించిందని దామచర్ల స్పష్టం చేశారు. అలాగే అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిం చడానికి సీఎం చంద్రబా బునాయుడు కృషి చేస్తు న్నారని పేర్కొన్నారు. నగ రంలో అనేక అభివృద్ధి ప నులు చేపట్టినట్లు తెలిపా రు. స్థానిక సమస్యలు ఉంటే నేరుగా తన దృ ష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 01:24 AM