ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అటు మద్రాసోళ్లు.. ఇటు లైసెన్స్‌ లేనోళ్లు...!

ABN, Publish Date - May 20 , 2025 | 11:22 PM

మత్య్స సంపద వేటతో జీవనాధారం సాగిస్తున్న వారి పరిస్థితి ప్రస్తుతం అయోమయంలో పడింది. అప్పుడప్పుడు అకస్మాత్తుగా మద్రాసీయులకు చెందిన ట్రావెలర్‌ బోట్లు ఆంధ్రా పరిధిలోని తీరంలో అనధికారంగా చొరబడి వేట సాగిస్తున్నారు.

మద్రాసీయులు అనధికారంగా పరిధి దాటి వేట(ఫైల్‌)

చీరాల సముద్ర తీరంలో నిషేధ కాలంలో అక్రమంగా చేపల వేట

భవిష్యత్తులో మత్స్య సంపద వృద్ధికి శరాఘాతం

నామమాత్రంగా అధికారుల తనిఖీలు

చర్యలు తీసుకోవాలని వినతులు

చీరాల, మే20 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం తీరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు మత్స్య సంపద వృద్ధి చెందే సమయం కావడంతో ఈ సమయంలో మత్స్యకారులు వేటను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. జిల్లాలో సుమారు 75 కిలోమీటర్లు తీరం ఉండగా, అందులో వేట సాగిస్తూ జీవనం గడుపుతున్న మత్స్యకార కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి.

సుమారు 40 మంది అనధికార వేట

మత్య్స సంపద వేటతో జీవనాధారం సాగిస్తున్న వారి పరిస్థితి ప్రస్తుతం అయోమయంలో పడింది. అప్పుడప్పుడు అకస్మాత్తుగా మద్రాసీయులకు చెందిన ట్రావెలర్‌ బోట్లు ఆంధ్రా పరిధిలోని తీరంలో అనధికారంగా చొరబడి వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో గుర్తించి నిలదీసిన మత్స్యకారులపై దాడులకు పాల్పడటమే కాకుండా వలల కూడా లాక్కెళ్లిన ఉదంతాలు తెలిసిందే. దీంతో స్థానిక మత్స్యకార సంఘాల నాయకులు ఇటీవల రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను కలిసి వినతి అందజేశారు. ఈనేపథ్యంలో హోం మంత్రి విషయాన్ని సంబంధిత అధికారులకు సూచనలు కూడా చేశారు. తాజాగా స్థానికంగా లైసెన్స్‌లు లేని మోటారు బోటు మత్స్యకారులు సైతం తామేం తక్కువ కాదంటూ ఇష్టారీతిగా తీరంలోకి చొరబడి అక్రమంగా వేట సాగిస్తున్నారు. ఈ తరహా బోట్లు సుమారు 40 మంది తీరంలోకి వెళుతున్నట్లు సమాచారం. అసలే సంధికాలం, పైగా అనఽధికార బోట్లు.. అయినా కూడా విచ్చలవిడిగా వేట సాగిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన మత్స్యకార సంఘాల నాయకులు సీఎంవోకు ఫిర్యాదు చేయడంతో అఽధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అనఽధికార వేటను గుర్తించారు. వారికి పలు హెచ్చరికలు జారీ చేశారు. ఇలా అక్రమంగా చేపల వేట వల్ల సముద్రంలో మత్స్య సంపద వృద్ధికి పెనుముప్పు వాటిల్లింది.

తనిఖీలు నామమాత్రమే

ఫిర్యాదులు చేస్తేనే అఽఽధికారులు తనిఖీలకు వస్తున్నారు గానీ, పర్యవేక్షణలోపం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వేట సంఽధికాలం నుంచి వేట సాగిస్తున్నా అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని విమర్శలు ఉన్నాయి. ఈ విధంగా మద్రాసీయులు ఒకవైపు, అనధికార లైసెన్సీయులు మరోవైపు వేట సాగిస్తే సంపద వృద్ధి చెందక భవిష్యత్తులో వేట సాగక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని మత్స్యకారులు విలపిస్తున్నారు.

Updated Date - May 20 , 2025 | 11:22 PM