ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - May 31 , 2025 | 10:43 PM

రాష్ట్ర ప్రభు త్వం అమలుచేస్తున్న పథకాలను పేదలు సద్విని యో గ పరుచుకొని అభివృద్ధి చెందాలని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివా రం ముండ్లమూరులో రేషన్‌ షాపులను సందర్శించి నిత్యావసర సరుకులను కార్డు దారులకు అందజేశారు.

ముండ్లమూరులో కార్డుదారులకు రేషన్‌ సరుకులు అందజేస్తున్న డాక్టర్‌ లక్ష్మి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

తాళ్లూరు, మే 31 (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అ న్నారు. శనివారం మండలంలోని శివరాంపురం గ్రామంలో పలువురికి పెన్షన్లు పంపి ణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారని అన్నా రు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేష్‌ సహకారంతో దర్శి నియోజక అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు చెప్పారు.

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. తాళ్లూరు వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద స బ్సిడీపై మంజూరయిన వ్యవసాయ పరికరాలను రైతులకు అందజేశారు. పలు గ్రామాల రైతులకు రూ.8కోట్ల 30లక్షల విలువైన 18సబ్సిడీ యంత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీను, టీడీపీ మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి, బి.ఓబుల్‌రెడ్డి, మానం రమేష్‌బాబు, శాగం కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ముండ్లమూరు : రాష్ట్ర ప్రభు త్వం అమలుచేస్తున్న పథకాలను పేదలు సద్విని యో గ పరుచుకొని అభివృద్ధి చెందాలని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివా రం ముండ్లమూరులో రేషన్‌ షాపులను సందర్శించి నిత్యావసర సరుకులను కార్డు దారులకు అందజేశారు. ఈసందర్భంగా ఆ మె మాట్లాడుతూ ప్రభుత్వం తక్కువ ధర లకు నిత్యావసర సరుకులను పంపిణీ చే స్తున్నట్టు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం లో పేదలకు అందాల్సిన నిత్యావసర సరు కులు పక్కదారి పట్టాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రు ల కమిటీతో అధ్యయనం చేసి గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్న పాత పద్ధతిని ప్రవేశపె ట్టినట్టు చెప్పారు. రేషన్‌ షాపు డీలర్లు అక్రమాలకు పాల్పడకుండా కార్డుదారులకే సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడి నట్లయితే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు. అనంతరం గ్రామంలో పలువురు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, సోమేపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్‌ ఒద్ది పోగు ఆదిలక్ష్మి, డీలర్‌ వీరపనేని నాగేశ్వరరావు, మండ ల రేషన్‌ షాపుల డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగసూరి సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2025 | 10:43 PM