ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - May 01 , 2025 | 10:57 PM

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మా ర్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. రాజ్యలక్ష్మి కాలనీలో గురువారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారునికి పింఛన్‌ను ఎమ్మెల్యే నారాయణరెడ్డి అందజేశారు.

పింఛన్‌ను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కందుల

మార్కాపురం, మే 1 (ఆంధ్రజ్యోతి) : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మా ర్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. రాజ్యలక్ష్మి కాలనీలో గురువారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారునికి పింఛన్‌ను ఎమ్మెల్యే నారాయణరెడ్డి అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రతి నెలా 1వ తేదీన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను ప్రభుత్వం అందిస్తోందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, తలసీమియా, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మే రకు గతం కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, సీనియర్‌ నాయకులు వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సొంత డబ్బులో మూడో నెల పింఛన్‌ అందజేత

కంభం, మే 1 (ఆంధ్రజ్యోతి) : వరుసగా మూడో నెల కూడా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తన సొంత నగదును పింఛన్‌గా అందజేశారు. తనకు అన్ని అర్హతలున్నా పింఛన్‌ రావడం లేదని, తనకు పింఛన్‌ ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 12న జరిగిన మీకోసంలో రాచపూటి కృష్ణ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని కోరగా స్పందించిన ఆయన పింఛన్‌ మంజూరయ్యే వరకూ తన సొంత నగదు రూ.4వేలు పింఛన్‌గా అందజే స్తానని ప్రకటించారు. మార్చి, ఏప్రిల్‌, మేలో వరుసగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సొంత నగదును కృష్ణకు టీడీపీ మండలపార్టీ అధ్యక్షుడు తోట వెంకట శ్రీనివాసుల ద్వారా అందచేస్తున్నారు. బాధితుడు కృష్ణ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆదర్శ గ్రామాలే లక్ష్యం

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

పుల్లలచెరువు : అభివృద్ధి పనులు చేసి గ్రామాలను ఆదర్శవంతముగా తీర్చిదిద్దడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. గురువారం మండలంలోని నరజాముల తాండాలో ప్రభు త్వ పింఛన్‌లను ఎరిక్షన్‌బాబు పంపిణీ చేశా రు. కొత్తగా పింఛన్‌లు మంజూరైనట్లు చెప్పా రు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1వ తే దీన పింఛన్‌, ఉద్యోగులకు జీతాలను అందజేస్తున్నామన్నారు. గత వైసీపీ పాలనలో ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు, కొత్తగా సీసీ రోడ్లతో గ్రామాల రూపురేఖలు మార్చుతున్నామన్నారు. ఎంపీడీవో బీ శ్రీనివాసులు, ఎం పీపీ వెంకటయ్య, టీడీపీ మండలాధ్యక్షుడు ప య్యావుల ప్రసాద్‌, రెంటపల్లి సుబ్బారెడ్డి, శన గా నారాయణరెడ్డి, వేగినాటి శ్రీను, మంత్రునాయక్‌, సేవ్యా నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2025 | 10:57 PM