ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నెరవేరని ఇంకుడు గుంతల లక్ష్యం

ABN, Publish Date - Jun 18 , 2025 | 10:06 PM

వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాల వృద్ధికి ప్రభుత్వం చొరవ చూపింది. పశ్చిమ ప్రాంత పల్లెల్లో ఇంకుడు గుంతల ఏర్పాటుకు కార్యాచరణ ఏర్పాటు చేశారు. వాన నీటిని, వాడుక నీటిని నేరుగా భూమిలోకి ఇం కింప చేసేందుకు ఇంకుడు గుంతలు తోడ్పడతాయి.

అర్ధవీడులో ఇంకుడు గుంతలు తీస్తున్న కూలీలు (ఫైల్‌)

ప్రభుత్వం చొరవ చూపినా ..

అధికారుల నిర్లక్ష్యం

మంజూరైనవి 7,543, తవ్వినవి 1,716

కంభం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) : వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాల వృద్ధికి ప్రభుత్వం చొరవ చూపింది. పశ్చిమ ప్రాంత పల్లెల్లో ఇంకుడు గుంతల ఏర్పాటుకు కార్యాచరణ ఏర్పాటు చేశారు. వాన నీటిని, వాడుక నీటిని నేరుగా భూమిలోకి ఇం కింప చేసేందుకు ఇంకుడు గుంతలు తోడ్పడతాయి. ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు తీసే పనులు ప్రారంభించి 3 నెలలు గడిచినా లక్ష్యం నెరవేరలేదు. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. గుంతల తవ్వకానికి మాత్రం గ్రామాల్లో అడుగులు పడడం లేదు. పథకం ప్రారంభంలో హడావుడి చేశారు. 7,543 ఇంకుడు గుంతలు మంజూరు కాగా కేవలం 1,716 గుంతలను మాత్రమే తవ్వారు. మిగతా గుంతలు మొదలు పెట్టలేదు. ఉపాధి హామీ కూలీలు వ్యక్తిగతంగా ఇంటి ఆవరణలో గుంతలను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం రూ.6వేల నగదు ఇస్తుంది. అయితే కూలీలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఉదయం ఉపాధి పనులకు వెళ్లి వచ్చిన తరువాత ఈ గుంతలను తవ్వేందుకు వీలుంది. కానీ క్షేత్ర సహాయకులు వీటిపై దృష్టి సారించడం లేదు. రానున్న వర్షాకాలానికి ఇంకుడు గుంతల తవ్వకాలు పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆచరణలో పెట్టడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఇంకుడు గుంతల ఏర్పాటుకు చొరవ చూపి, లక్ష్యం మేరకు పూర్తి చేస్తే ఎంతో మేలు చేకూరుతుంది.

Updated Date - Jun 18 , 2025 | 10:06 PM