వైభవంగా శ్రీపద్మావతి గోదాసమేత శ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ
ABN, Publish Date - May 08 , 2025 | 11:28 PM
ఒంగోలు నగరం దశరాజుపల్లి రో డ్డులోని లక్ష్మీపురంలో నూతనంగా ని ర్మించిన శ్రీపద్మావతి, గోదా సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కల్యాణ క్రతువును నిర్వహించిన వేదపండితులు
గోవింద నామస్మరణతో మారుమోగిన దేవాలయ ప్రాంగణం
వేలాదిగా పొల్గొన్న భక్తులు
భారీగా అన్నప్రసాద వితరణ
ఒంగోలు(రూరల్), మే8(ఆంధ్రజ్యో తి): ఒంగోలు నగరం దశరాజుపల్లి రో డ్డులోని లక్ష్మీపురంలో నూతనంగా ని ర్మించిన శ్రీపద్మావతి, గోదా సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే కలశ, ధ్వజస్తంభంలను ప్రతిష్ఠను వేలాది మంది భక్తు ల గోవింద నామస్మరణ మధ్య చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సందడి నెలకొంది. అలాగే భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జ నార్దన్ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ లయ ప్రతిష్ఠలో భాగంగా శ్రీపద్మావతి గోదా సమేత శ్రీప్రసన్నవేంకటేశ్వరస్వా మి కల్యాణం వేదపండితులు వైభవంగా నిర్వహించారు. స్వామివారి క ల్యా ణం తిలకించ టం భక్తులకు ఎంతో పుణ్యప్రదమని పేర్కొన్నారు. భక్తులకు లడ్డూ, ప్రసాదాలు పంపిణీ చేశా రు. కాగా ఆలయ ధర్మకర్త అబ్బూరి చంద్రమౌళి, కార్పొరేటర్ దాచర్ల రమణయ్య, నన్నపనేని ఆంజనేయులు, టీడీపీ నాయకుడు బైరపనేని తిరుపతిరావు, చెన్నరెడ్డి రాంబాబు, కమ్మపాలెం యువత కార్యక్రమాలను పర్యవేక్షించారు.
Updated Date - May 08 , 2025 | 11:28 PM