ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రింగ్‌రోడ్డుకు రంగం సిద్ధం

ABN, Publish Date - Apr 22 , 2025 | 12:56 AM

ఒంగోలులో ట్రాఫిక్‌ రద్దీని నియం త్రించేందుకు పశ్చిమ వైపున మరో బైపాస్‌ ఏర్పాటుకు మూడు ప్రతిపాదనలను కన్సల్టెన్సీ ప్రతినిధులు రూపొందించారు. వాటిపై సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయకుమార్‌లు సంబంధిత అధికారులతో చర్చించారు.

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను చూస్తున్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌

ఒంగోలులో పశ్చిమ బైపాస్‌కు మూడు ప్రతిపాదనలు

కన్సల్టెన్సీ ప్రతినిధులతో చర్చించిన ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌

త్వరలో కేంద్ర బృందం పరిశీలన

తర్వాత పూర్తిస్థాయిలో డీపీఆర్‌

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో ట్రాఫిక్‌ రద్దీని నియం త్రించేందుకు పశ్చిమ వైపున మరో బైపాస్‌ ఏర్పాటుకు మూడు ప్రతిపాదనలను కన్సల్టెన్సీ ప్రతినిధులు రూపొందించారు. వాటిపై సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయకుమార్‌లు సంబంధిత అధికారులతో చర్చించారు. ఒంగోలుకు పశ్చిమ వైపున బైపాస్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధంచేసినట్లు కన్సల్టెన్సీ ప్రతినిధి సురేష్‌ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా ఎంపీ, ఎమ్మెల్యే లకు వివరించారు. త్రోవగుంట సమీపంలోని చీరాల రోడ్డు నుంచి భగీరథ ఫ్యాక్టరీ మీదుగా జాతీయ రహదారి వరకు రింగ్‌రోడ్డు మాదిరిగా ఒక ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు. మద్దిపాడు మండలం కొష్టాల నుంచి వల్లూరు సమీపంలో జాతీయ రహదారి వరకు మరొకటి, వెల్లంపల్లి నుంచి ఎండ్లూరు డొంక వద్ద ఉన్న ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల మీదుగా తూర్పునాయుడుపాలెం వరకూ మూడో ప్రతిపాదన ఉన్నట్లు తెలిపారు. వీటిపై జాతీయ రహదారులకు సంబంధించిన బృందం పరిశీలించిన తర్వాత డీపీఆర్‌ను రూపొందిస్తామని ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చారు. వాటిపై ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌లు చర్చించారు. ఆయా ప్రతి పాదనలను కేంద్రానికి పంపించాలని వారు సూచించారు. ఒంగోలులో ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు తీసుకోవా ల్సిన అంశాలను దృష్టిలో ఉంచుకొని సమగ్రంగా ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలని సూచిం చారు. సమావేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌, మేయర్‌ గంగాడ సుజాత, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ దేవానంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:56 AM