ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రహదారులు దారుణం .. అవస్థల ప్రయాణం

ABN, Publish Date - Jun 23 , 2025 | 11:16 PM

గడిచిన ఐదేళ్లూ వైసీపీ పాలకులు రోడ్ల అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం కారణంగా రహదారులు అధ్వానంగా మారాయి. వీటిపై అవస్థలతో ప్రయాణం చేయా ల్సి వస్తుందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కనీసం ప్రధానరోడ్లను కూడా పట్టించుకోకుండా ఐదేళ్లు హామీలకే పరిమితమయ్యారని ప్రజలు అంటున్నారు.

ఎరిక్షన్‌బాబు చొరవతో త్రిపురాంతకంరోడ్డుకు మరమ్మతులు (ఫైల్‌)

ఐదేళ్లు పట్టించుకోని వైసీపీ పాలకులు

గోతులు పూడ్చిన ప్రజా ప్రభుత్వం

రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు

త్రిపురాంతకం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : గడిచిన ఐదేళ్లూ వైసీపీ పాలకులు రోడ్ల అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం కారణంగా రహదారులు అధ్వానంగా మారాయి. వీటిపై అవస్థలతో ప్రయాణం చేయా ల్సి వస్తుందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కనీసం ప్రధానరోడ్లను కూడా పట్టించుకోకుండా ఐదేళ్లు హామీలకే పరిమితమయ్యారని ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పుల్లలచెరువు - ఎర్రగొండపాలెం రోడ్డు, త్రిపురాంతకం - ఎర్రగొండపాలెం రోడ్డును డబుల్‌ రోడ్డుగా అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చారే తప్ప వాటిపై కనీసం తట్టెడు మట్టిపోసిన పాపాన పోలేదు. డబుల్‌ రోడ్డు సంగతి దేవుడెరుగు కనీసం గుంతలు పూడ్చిన వారు కూడా గతంలో లేరు. కొన్ని సార్లు ఆటో డ్రైవర్లు స్వయంగా మట్టిని తెచ్చి గుంతలు పూడ్చుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. నియోజకవర్గ కేంద్రం ఎర్రగొండపాలెంకు వచ్చేందుకు నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్లే ఇలా ఉంటే గ్రామాల్లోని లింకురోడ్లు ఎలా ఉంటాయో చెప్పనక్కరలేదు. త్రిపురాంతకం వైపు వెళ్లే రోడ్డు ఎర్రగొండపాలెం ప్రారంభంలోనే గోతులు మయమై వర్షం పడిన సమయాల్లో అధ్వాన్నంగా ఉండేది. దీనిని చూసిన టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు గ్రావెల్‌ తోలి గుంతలు పూడ్పించారు. త్రిపురాంతకం రోడ్డుతోపాటు పుల్లలచెరువు వెళ్లే రోడ్డుకు కూడా ప్రజా ప్రభుత్వం చేపట్టిన గుంతలు లేని రోడ్డు కార్యక్రమంలో భాగంగా తాత్కాలిక మరమ్మతులు చేశారు. దీంతో కాస్త ఉపశమనం దక్కింది. కానీ ఈ రెండు రోడ్లు పూర్తిగా వేయని కారణంగా అక్కడక్కడా ఉన్న గోతులు, రోడ్డుకు అడ్డుగా తవ్విన కాలువలు కారణంగా ప్రయాణం ఇబ్బందికరంగానే సాగుతుందని వాహనదారులు, ప్రయాణీకులు చెప్తున్నారు. త్రిపురాంతకం - ఎర్రగొండపాలెం రోడ్డు, పుల్లలచెరువు - ఎర్రగొండపాలెం రోడ్డు రెండు కూడా కేవలం 20 కిలోమీటర్లు దూరమే అయినప్పటికీ ప్రయాణం మాత్రం గంటసేపు పడుతుందంటే రోడ్లు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని త్వరలో మంజూరుకాగానే పనులు చేపడతామని ఎరిక్షన్‌బాబు చెపుతున్నారు. ఈ రోడ్ల నిర్మాణం చేపట్టి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:16 PM