ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా రాజగోపురం పంచ విమాన శిఖరాల ప్రతిష్ఠ

ABN, Publish Date - Mar 17 , 2025 | 11:48 PM

వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య భక్తి పారవశ్యంతో భక్తులు కనులారా తిలకిస్తుండగా సోమవారం యద్దనపూడి మండలంలోని పూనూరు గ్రామంలో రాజగోపురం పంచ విమాన శిఖరాల ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీ త్రిపుర సుందరి సమేత శ్రీ త్రిపురాంతకస్వామి, భద్రకాళీసమేత వీరభద్రస్వామి దేవస్థానంలో జరిగిన రాజగోపురం ప్రతిష్ఠ కార్యక్రమానికి గ్రామస్థులపాటు గన్నవరం, బొబ్బేపల్లి గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి వారి కార్యక్రమాన్ని తిలకించారు.

దేవస్థానం వద్ద దాత హనుమంతురావు దంపతుల సహకారంతో ఏర్పాటుచేసిన రాజగోపురం

యద్దనపూడి, (మార్టూరు) మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య భక్తి పారవశ్యంతో భక్తులు కనులారా తిలకిస్తుండగా సోమవారం యద్దనపూడి మండలంలోని పూనూరు గ్రామంలో రాజగోపురం పంచ విమాన శిఖరాల ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీ త్రిపుర సుందరి సమేత శ్రీ త్రిపురాంతకస్వామి, భద్రకాళీసమేత వీరభద్రస్వామి దేవస్థానంలో జరిగిన రాజగోపురం ప్రతిష్ఠ కార్యక్రమానికి గ్రామస్థులపాటు గన్నవరం, బొబ్బేపల్లి గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి వారి కార్యక్రమాన్ని తిలకించారు. గ్రామానికి చెందిన దాత రాటకొండ హనుమంతురావు, రాధిక దంపతుల ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన రాజగోపురం ఆలయానికి అందమైన కళను తీసు కువచ్చింది. తొలుత రాజగోపు రం ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత పైభాగా న ఏర్పాటుచేసిన పంచ విమాన శిఖరాల ప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా పంచ విమాన శిఖరాలను భక్తులు దర్శించుకొని, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేసిన రాజగోపురం వద్ద,ధ్వజ స్తంభం వద్ద మహిళలు కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు. ఈ సందర్బంగా ఉదయాన్నే దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన హామగుండంలో భక్తులు పలుపూజా ద్రవ్యాలను వేసి నమస్కరించుకున్నారు. అదేవిధం గా యజ్ణయాగాదులు కార్యక్రమాన్ని ప్రత్యేక స్థలంలో నిర్వహించారు. తదుపరి ప్రతిష్ఠా చార్యులు మూలంరాజు రాజ్‌కుమార్‌ శర్మ పర్యవేక్షణలో పలువురు వేదపండితులు ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకముల అ లంకరణ మహాపూర్ణాహుతి, దేవతా దర్శనములు కార్యక్రమాలను నిర్వహించారు. త్రిపురసుందరీ సమేత త్రిపురాంతకస్వామిని భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులను పొందారు. అనంతరం భక్తులకు భారీగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది.

Updated Date - Mar 17 , 2025 | 11:48 PM