ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఉపాధి’లో మస్టర్ల మాయాజాలం

ABN, Publish Date - Jul 21 , 2025 | 12:29 AM

ఉపాధి హామీ పఽథకం అమలులో అవినీతి పెరిగిపోతోంది. వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా దొంగమస్టర్లకు అలవాటు పడ్డ క్షేత్రస్థాయి సిబ్బంది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా అదే పందా కొనసాగిస్తున్నా రు.

అద్దంకి, జూలై20 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పఽథకం అమలులో అవినీతి పెరిగిపోతోంది. వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా దొంగమస్టర్లకు అలవాటు పడ్డ క్షేత్రస్థాయి సిబ్బంది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా అదే పందా కొనసాగిస్తున్నా రు. గ్రామస్థాయి నాయకులను ప్రసన్నం చేసుకునేందు కు స్థానిక నేతలకు, వారి కుటుంబసభ్యులు పనులకు వెళ్లకుండానే మస్టర్లు వేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా వారినెలాగు నొరత్తకుండా చూశాము కథా అని, ఇష్టనుసారం వారు దొంగమస్టర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏనాడు ఉపాధి పనుల ముఖం కూడా చూడని వారికి, చిరు ఉద్యోగులు, ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసే వారికి ఎప్పుడో చనిపోయిన పోయిన వారికి చోటామోటా నాయకులకు మస్టర్లు వేస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో దొంగ మస్టర్లు వేసేందుకు అలవాటు చేసిన మండల స్థాయి సిబ్బంది, అధికారులు ఆపైనా ఏదో ఒకసాకు చెప్పి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. వారి నుంచి మాముళ్లు పుచ్చుకుంటున్నారు..! ఇక జిల్లా స్థాయి నుంచి తనిఖీకి వచ్చారంటే ఖర్చుకు లేక్కే ఉండదు. సామాజిక తనిఖీ సందర్భంగా వసూళ్ల పర్వానికి అంతే లేకుండా పోతోంది. సామాజిక తనిఖీ ప్రజావేదికకు వచ్చే జిల్లాస్థాయి అధికారికి అక్షరాల లక్ష రూపాయలు ముట్టజెప్పాల్సిందే..! ఇక సామాజిక తనిఖీ చేసే సిబ్బంది, ఇతర సిబ్బంది కి మరో లక్ష రూపాయలు ఖర్చు షరా మాములే..! సామాజిక తనిఖీకి ప్రభుత్వం నుండి ప్రతి మండలానికి రూ.2 లక్షల నిధులు విడుదల చేస్తోంది. అయితే సామాజిక తనిఖీ చేసే సిబ్బంది క్షేత్రస్థాయిలో అవకతవకలు గుర్తించినా, స్థానికంగా ఫిర్యాదులు అందినా అవి మం డల స్థాయి లో జరిగే ప్రజావేదికలో మాత్రం చర్చకు రావు. ఒకవేళ సిబ్బంది ఒకింత నిజాయితీతో అవకతవ లను ప్రజా వేదిక దృష్టికి తీసుకు వచ్చినా ఉన్నత స్థాయి అధికారులు మరి కొంత అదనపు సొమ్ము తీసుకొని ఆల్‌ కరెక్ట్‌గా ధ్రువీకరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మండల స్థాయిలో ఉపాధి పను లు పర్యవేక్షణ చేసే అధికారులు ఇక్కడిక్కడే ఒక మండలం నుండి మరో మండలానికి బది లీ అవుతూ దశాబ్దాల తరబడి పనిచేస్తూ ఒకరికొకరు సహకరించుకుంటు న్నారనే విమర్శలు బలంగా వస్తున్నాయి. అద్దంకి నియోజక వర్గంలో ప్రతి రోజు సరాసరిన 20 వేల మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. వారిలో కనీసం ఐదారు వేల మందికి ప్రతిరోజు దొంగ మస్టర్లు పడుతున్నా యని అంచనా ఉంది. ఈ విషయాలను ఇటీవల సంతమాగులూరు మండలం వెల్లలచెరువులో మంత్రి రవికుమార్‌ సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం లో పాల్గొన్న సమయంలోనే స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. అదే సమయంలో ఇతర మండలాలలోనూ పలు సందర్భాలలో మంత్రి రవి కుమార్‌ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో రవికుమార్‌ ఉపాధిహామీ పథకంలో చోటు చేసుకుంటున్న అవకతవకల పై విచారించాల్సిందిగా పీడీ విజయలక్ష్మిని ఆదేశించినట్లు తెలుస్తోంది. విచారణ మొక్కుబడిగా కాకుండా అన్ని మండలాలలో పూర్తి స్తాయిలో చేపడితే ఉపాధిలో అవినీతి వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ప్రజావేదికలో మసి పూసి మారేడు కాయ చేసినట్లు విచారణలోనూ మాయాజాలం ప్రదర్శిస్తారో లేక నిజాయితీగా విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Jul 21 , 2025 | 12:30 AM