సీహెచ్‌వోల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి
ABN, Publish Date - May 24 , 2025 | 12:43 AM
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న క మ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షలు శుక్రవారానికి 25వరోజు కు చేరాయి.
కొనసాగుతున్న నిరసన
ఒంగోలు కలెక్టరేట్. మే 23 (ఆంఽధ్రజ్యోతి): ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న క మ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షలు శుక్రవారానికి 25వరోజు కు చేరాయి. ఈ సందర్భంగా భారీ ర్యాలీ ని ర్వహించి చర్చిసెంటర్‌లో యోగాసనాలతో మా నవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కమ్యూ నిటీ హెల్త్ ఆఫీసర్ల న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ము ఖ హాజరును రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పిం చాలని కోరారు. వేతనాలు పెంచడంతో పాటు 23శాతం ఇంక్రిమెంట్‌మంజూరు చేయాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందగిరి రాజేష్, జిల్లా కా ర్యదర్శి గంటా ప్రసన్న, జిల్లా ఉపాధ్యక్షురాలు జీవనజ్యోతి, రమేష్, కామేష్, దీప్తి, లక్ష్మీకాంత మ్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 24 , 2025 | 12:43 AM