ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్య కన్నా సభకే ప్రాధాన్యం

ABN, Publish Date - Jun 10 , 2025 | 11:09 PM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాక సందర్భంగా భారీగా ప్రజలను సమీకరించేందుకు వైసీపీ నాయకులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తద్వారా ప్రజల్లో పార్టీకి ముఖ్యంగా జగన్‌కు ఆదరణ తగ్గలేదన్న భావన కలిగించే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

పొగాకు సాగులేని ప్రాంతాల నుంచి

భారీగా తరలింపుకు నేతల యత్నాలు

నేడు పొదిలిలో పొగాకు రైతులతో జగన్‌ ముఖాముఖి

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాక సందర్భంగా భారీగా ప్రజలను సమీకరించేందుకు వైసీపీ నాయకులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తద్వారా ప్రజల్లో పార్టీకి ముఖ్యంగా జగన్‌కు ఆదరణ తగ్గలేదన్న భావన కలిగించే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ నేతల ప్రయత్నాలను పరిశీలిస్తే జగన్‌ బుధవారం పొదిలి రాక వెనక పొగాకు రైతుల సమస్య పరిష్కారమా లేక బల నిరూపణ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏమైనా ఈ ఏడాది దేశవ్యాప్తంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించటం లేదు. కొన్ని పంటల ఉత్పత్తులు అయితే కొనే నాధుడే కరువయ్యాడు. ఈ దశలో ఆయా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు కూడా చేపట్టాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రధానమైన వాణిజ్య పంట పొగాకు అధికంగా సాగు అవుతుంది. ఒకవైపు దొర పొగాకు, బర్లీ పొగాకును రైతుల భారీగా పండించారు.

బర్లీ సమస్య ప్రభుత్వం స్పందన ఇలా...

బర్లీ సాగులో పర్చూరు నియోజకవర్గం అగ్రగామిగా ఉంది. మొత్తం నల్లబర్లీ సాగులో 65శాతం సాగు అక్కడే జరుగుతుంది. నల్ల, తెల్లబర్లీని కొనేవారు కరువయ్యారు. ఈ సమస్యను తొలుత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఆపై మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తదితరులు జోక్యం చేసుకున్నారు. వివిధ పరిణామాల అనంతరం బర్లీ పొగాకు కొనుగోలుకు రాష్ట్రప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. పర్చూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ బర్లీ పొగాకు రైతుల సమస్యలపై వైసీపీ గాని ఆ పార్టీ అధినేత జగన్‌ కాని ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు.

నేగు జగన్‌ కార్యక్రమ తీరుతెన్ను

ఈ నేపఽథ్యంలో రాష్ట్రంలో ముఖ్య ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమే. కానీ అందుకు జగన్‌ దొర పొగాకు అధికంగా పండే ప్రాంతాలను వదిలేసి పొదిలి ప్రాంతాన్ని ఎంచుకోవటమే చర్చనీయాంశమైంది. దీనికితోడు జగన్‌ రాక సందర్భంగా ప్రజలను భారీగా సమీకరించేందుకు వైసీపీ నాయకులు సర్వశక్తులొడ్డి ప్రయత్నించటం కూడా చర్చనీయాంశమైంది. అందునా దొర పొగాకు తక్కువగా పండే దర్శి, మార్కాపురం, వైపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి జనసమీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోనే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నాయకులు భారీగా వాహనాలు ఏర్పాటు చేయటం విశేషం. మరోవైపు తూర్పు ప్రాంతంలో కూడా వైసీపీ నాయకులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి అదేదో బలప్రదర్శన అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. దీంతో జగన్‌ రైతుల కోసమా.. బలప్రదర్శన కోసమా అనేది చర్చనీయాంశమైంది. పైగా ఆయన కూడా ఎప్పటిలాగే గంట సమయం మాత్రమే కేటాయించటం విశేషం.

జిల్లాలోనే అత్యధికం

ఇక దొర పొగాకు సాగు విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో అత్యధిక విస్ర్తీర్ణంలో సాగు అవుతుందనేది జగమెరిగిన సత్యం. ఈ పంట సాగు కూడా అధికంగా కందుకూరు, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు ఆ తర్వాత కనిగిరి, పొదిలి ప్రాంతాలతోపాటు ఇతర నియోజకవర్గాల్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో సాగవుతుంది. గత ఏడాది అత్యధిక ధర లభించింది. మంచి లాభాలు వచ్చాయి. దీంతో రైతులు మరింత ఉత్సాహంతో ఈ ఏడాది అధిక విస్ర్తీర్ణంలో సాగు చేశారు. దిగుబడి పెరగటంతో మార్కెట్‌లో సమస్య ఎదురైంది. అంతోఇంతో కొనుగోలులో సమస్యలు లేవు. గత ఏడాది కన్నా ధర తగ్గటమే ప్రధాన సమస్య. ఈ విషయంపై రాష్ట్రప్రభుత్వం కూడా స్పందించింది. ఒంగోలులో మంత్రులు స్వామి, రవికుమార్‌, రామనారాయణరెడ్డి ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు ఈ సమస్యపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బోర్డు చైర్మన్‌, అధికారులు, వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకొని కేంద్ర పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడటంతో పాటు వ్యాపార సంస్ధలు రైతులకు న్యాయం చేయకపోతే ఇబ్బందిపడతారని హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత కొనుగోలులో వేగం పెరిగినప్పటికీ గత ఏడాది ధర మాత్రం రైతులకు లభించని మాట నిజం. బర్లీ పొగాకు కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించిన రాష్ట్రప్రభుత్వం తదనంతర చర్యగా దొర పొగాకు సమస్యపై దృష్టిసారించింది.

Updated Date - Jun 10 , 2025 | 11:09 PM