ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా సత్యదేవుని రథోత్సవం

ABN, Publish Date - May 12 , 2025 | 10:37 PM

మార్కాపురంలోని 9వ వార్డులో వెలసియున్న శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామి కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు రెంటచింతల గౌరిశంకర శర్మ సత్యనారాయణస్వామి మూలవిరాట్‌కు అభిషేకాలు, అలంకరణ, అర్చనలు నిర్వహించారు.

రథోత్సవంలో రమాసహిత సత్యదేవుడు

మార్కాపురం వన్‌టౌన్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురంలోని 9వ వార్డులో వెలసియున్న శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామి కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు రెంటచింతల గౌరిశంకర శర్మ సత్యనారాయణస్వామి మూలవిరాట్‌కు అభిషేకాలు, అలంకరణ, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం సత్యదేవునికి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రమా సహిత సత్యదేవుని ఉత్సవర్లను శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ వీధులలో రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అడుగడుగునా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బాసాని సుధాకర్‌, ఉపాధ్యాక్షులు డి.శ్రీనివాసులు, డి.కోటేశ్వరరావు, కార్యదర్శి పొత్తంశెట్టి చిన్నసుబ్బారావు, సహాయ కార్యదర్శులు నూనె రామిరెడ్డి, బాసాని ఉమా, కోశాధికారి కేవీ సుధాకర్‌రావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు పర్యవేక్షించారు.

Updated Date - May 12 , 2025 | 10:37 PM